'క‌త్తి' ఇప్పుడు హిందీలో...

  • IndiaGlitz, [Monday,August 20 2018]

త‌మిళంలో విజ‌య్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో 2014లో విడుద‌లైన చిత్రం 'క‌త్తి'. రైతు స‌మ‌స్య‌ల‌పై ఈ చిత్రం ప్ర‌ధానంగా తెర‌కెక్కింది. తెలుగులో చిరంజీవి ఈ చిత్రం రీమేక్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో.. మెసేజ్ ఓరియెంటెడ్‌గా సినిమా సాగుతుంది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ కానుంది.

ప్రముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య‌ల్ లీలా బ‌న్సాలీ ఈ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నారు. మ‌రి సంజ‌య్ లీలా బ‌న్సాలీ డైరెక్ట్ చేస్తారా? లేక త‌న హోం ప్రొడ‌క్ష‌న్‌లో మ‌రో ద‌ర్శ‌కుడితో తెర‌కెక్కిస్తారనే వివ‌రాలు తెలియ‌డం లేదు. అయితే ఈ సినిమా క‌థ మురుగ‌దాస్‌ది కాదు.. దీని ర‌చ‌యిత న‌ర‌సింహా అనే తెలుగు రైట‌ర్‌. ఇప్పుడు న‌ర‌సింహ ఈ రీమేక్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి.

More News

సుమంత్‌కు శేష్ స‌హాయం

చాలా గ్యాప్ త‌ర్వాత గ‌త ఏడాది మ‌ళ్ళీరావా చిత్రంతో స‌క్సెస్ అందుకున్న హీరో సుమంత్ ఇప్పుడు 'ఇదం జ‌గ‌త్' అనే పేరుతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమా చేశాడు.

ఫ్యాన్సీ రేటుకు సుమంత్  సుబ్రహ్మణ్యపురం ఓవర్సీస్ హక్కులు

నిర్మాణంలో వుండగానే అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్న హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం.

'నీవెవ‌రో' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్

ఆది పినిశెట్టి, తాప్సీ,  రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో' . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో

'పందెంకోడి 2' షూటింగ్ పూర్తి

విశాల్..లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి'(సండైకోళి)కి సీక్వెల్‌గా 'పందెం కోడి 2' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో మెహ్రీన్

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఐదో సినిమాలో మెహ్రీన్ కౌర్ న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ లో అడుగుపెట్టింది ఈ భామ‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది.