మీ నోటీసులకు భయపడం, కోర్టులోనే తేల్చుకుంటాం .. హీరో ధనుష్‌కి కదిరేశన్ దంపతుల సవాల్

  • IndiaGlitz, [Thursday,May 26 2022]

తమిళ స్టార్ హీరో ధనుష్ తల్లిదండ్రులం తామేనంటూ మధురైకి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు గత ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతూ.. ఓ కొలిక్కి రావడం లేదు. తాజాగా కదిరేశన్, మీనాక్షిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది.

ధనుష్‌ తమ కుమారుడని, చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయి వచ్చాడంటూ కదిరేషన్‌, మీనాక్షి దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి వారు కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ న్యాయస్థానంలో వారికి చుక్కెదురైంది. మరోవైపు కదిరేషన్‌ దంపతుల వ్యవహారంతో విసిగిసోయిన ధనుష్‌, ఆయన తండ్రి కస్తూరి రాజా.. వారిద్దరికి లీగల్‌ నోటీసులు పంపించారు. తమ పేరుప్రతిష్టలకు భంగం కలిగించే చర్యలకు స్వస్తి పలకాలని... గత నాలుగేళ్లుగా చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెబుతూ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. లేని పక్షంలో పదికోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అయితే ఈ నోటీసుకు కదిరేశన్ దంపతులు ధీటుగానే బదులిచ్చారు. ధనుష్ పంపిన నోటీసులను చట్టపరంగా ఎదుర్కొంటామని కదిరేశన్ సవాల్ విసిరారు. నోటీసులకు తాము భయపడమని , చట్టపరంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ధనుష్‌కి తిరిగి నోటీసులు పంపించారు కథిరేశన్. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

More News

అమెరికా పర్యటనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. జూన్ 6 వరకు అక్కడే

టీపీసీసీ చీఫ్ , మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు.

కోనసీమ అల్లర్లు వైసీపీ పనే.. గొడవ జరగాలని 30 రోజుల గడువు : పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్

ఏపీలోని అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టి.. కోనసీమకు మాత్రం మరో విధానం అనుసరించారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు

'థ్యాంక్యూ' టీజర్‌

ఈ ఏడాది లవ్‌స్టోరీ సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య తనకు సూటయ్యే కథలతో దూసుకెళ్తున్నారు.

ఎఫ్2కి మించిన వినోదం ఎఫ్3లో... పక్కాగా రిపీట్ ఆడియన్స్ వస్తారు: అనిల్ రావిపూడి

''తెలుగు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరిస్ వుండాలని ఎఫ్ 2 ఫ్రాంచైజ్ ని చేశాం.

అప్పుడే అంబేద్కర్ పేరు పెట్టాల్సింది.. జగన్‌ ఊగిసలాట వల్లే ఇలా : కోనసీమ అల్లర్లపై సీపీఐ నారాయణ

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దంటూ అమలాపురంలో మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా