close
Choose your channels

మ‌హేష్‌తో క‌త్రినా...

Saturday, January 5, 2019 • తెలుగు Comments

మ‌హేష్‌తో క‌త్రినా...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు త‌న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ఏప్రిల్ 5న సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నారు. దీని త‌ర్వాత మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో సుకుమార్‌తో మ‌హేష్ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాను ముందు ఏప్రిల్‌లో మొద‌లు పెడ‌తార‌ని వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పుడు జూన్‌లోనే సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా.. ఇప్పుడు క‌త్రినా కైఫ్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి మ‌రి. మ‌హేష్ స్పైడ‌ర్‌లో ముందుగా ప‌రిణీతిచోప్రాను తీసుకోవాల‌ని నిర్మాత‌లు అనుకున్నా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ర‌కుల్‌ను తీసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే క‌త్రినా కైఫ్ పేరు విన‌ప‌డుతుంది మ‌రి. 

Get Breaking News Alerts From IndiaGlitz