close
Choose your channels

రామ్ స్టోరీ రివీల్ చేసిన క‌ట్ట‌ప్ప‌

Wednesday, June 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేను శైల‌జ సినిమాతో స‌క్సెస్ సాధించిన ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తాజాగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. హైద‌రాబాద్ లో ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం వైజాగ్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

మిర్చి, బాహుబ‌లి, నేను శైల‌జ‌, బ్ర‌హ్మోత్స‌వం త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన స‌త్యరాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే...దొర చిత్రం ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న స‌త్యరాజ్ ని రామ్ సినిమా గురించి అడిగితే... తండ్రి - కొడుకుల మ‌ధ్య జ‌రిగే క‌థ‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో రామ్ తండ్రిగా న‌టిస్తున్నాను. ఫాద‌ర్, స‌న్ రిలేష‌న్స్ పై ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన చిత్రాల‌కు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది అంటూ రామ్ న్యూమూవీ స్టోరీ రివీల్ చేసేసారు క‌ట్ట‌ప్ప‌. అది సంగ‌తి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.