close
Choose your channels

కేసీఆర్‌ను 'కట్టప్ప' వెన్నుపోటు పొడుస్తారా..!?

Saturday, January 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్‌ను కట్టప్ప వెన్నుపోటు పొడుస్తారా..!?

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, 2014, 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ గుబాలించడానికి కీలకపాత్ర పోషించిన వ్యక్తి, కల్వకుంట్ల కుటుంబానికి ఒక ‘కట్టప్ప’లా ఉన్న తన్నీరు హరీశ్ రావు త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? 40మంది ఎమ్మెల్యేలతో హరీశ్ కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారా..? గతంలో జరిగిన వెన్నుపోటులాగే.. ఈ కట్టప్ప కూడా అదే పని చేయబోతున్నారా..? అంటే సోషల్ మీడియా పుకార్లు అవుననే అంటున్నాయి. అసలు ఈ పుకార్లేంటి..? హరీశ్ నిజంగానే ఇలా అనుకుంటున్నారా..? అసలేం జరిగిందనే దానిపై ప్రత్యేక కథనం.

హరీశ్‌ను తొక్కేస్తున్నారా..!?
హరీశ్‌‌ రావు టీఆర్ఎస్‌‌కు టాటా చెప్పేసి కాంగ్రెస్‌‌లో చేరతారని గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలా పుకార్లు వచ్చినప్పుడల్లా హరీశ్ రియాక్టవ్వడం షరామామూలైపోయింది. అయితే గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్‌‌లో హరీశ్‌‌ను తొక్కేస్తున్నారన్న ఊహాగానాలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు హరీశ్‌‌కు పార్టీలో ఎలాంటి ప్రాధన్యత ఉన్నదో అందరికీ తెలుసు.. అది కాస్త ముందస్త ఎన్నికలు జరిగిన తర్వాత అస్సలే హరీశ్‌‌ను పట్టించుకోకపోవడం.. సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కేసీఆర్‌పై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కొడుకు కోసం అల్లుడ్ని ఇలా...?
ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన కుమారుడికి పట్టాభిషేకం చేసిన కేసీఆర్.. త్వరలోనే అన్ని అన్నుకున్నట్లు జరిగితే కచ్చితంగా సీఎం సీటులో కూర్చోబెట్టాలనే నిర్ణయించారట. ఇందులో భాగంగానే కొడుక్కు.. హరీశ్ రూపంలో ఏ అడ్డంకీ రాకూడదని భావించి కేసీఆర్, హరీశ్ ఇద్దరూ జాతీయ రాజకీయాలకు పరిమితం కావాలని భావించారని వార్తలు వినవస్తున్నాయి. మరీ ముఖ్యంగా ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయడంఖా మోగించిన తర్వాత హరీశ్‌‌ను కేసీఆర్ పూర్తిగా పక్కనెట్టేశారని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ మాటను హరీశ్ ఏ రోజూ జవదాటడన్న విషయంజగమెరిగిన సత్యమే. అందుకే పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అన్ని అవమానాలు భరిస్తూ హరీశ్ మిన్నకుండిపోయారట. అయితే ఇందులో నిజమెంత..? అనేది ఆ పెరుమాళ్లకే ఎరుక.

అసలేం జరిగింది..!?
టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు.. మరో 40 మంది ఎమ్మెల్యేలతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టీఆర్ఎస్‌లో పోరు పడలేక హరీశ్ ఇలా చేస్తున్నారని ప్రశాంత్ మణి అనే వ్యక్తి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి హరీశ్‌‌ దృష్టికెళ్లడంతో తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ జనగామ టీఆర్ఎస్ నేతలు డీసీపీకి ఫిర్యాదు చేశారు. నేతల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అసలు ఈ మణి అనే వ్యక్తి ఎవరు..? ఎక్కడ్నుంచి ఈ పోస్ట్‌లు చేస్తున్నాడు..? ఈయన వెనుక ఎవరున్నారు..? అనే విషయాలను నిగ్గుతేల్చే పనిలో ఓ టీమ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

అసలు కథ ఇదేనా..!?
గతంలో నీటి పారుదల శాఖమంత్రిగా పనిచేసిన హరీశ్‌‌ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఈయన్ను ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగిపోయారు. అయితే 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత పలుమార్లు కేసీఆర్ ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల రివ్యూ జరిగింది. ఈ మీటింగ్‌లో గత మంత్రి లేకపోవడం.. మరీ ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టుల సందర్శనల్లో.. హరీశ్ కాకుండా కేసీఆర్ వెంట పలువురు కొత్త వ్యక్తులు కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే ఇదంతా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారాలేనని వీటన్నింటికీ అస్తమానూ స్పందించాల్సిన అవసరం లేదని భావించిన టీఆర్ఎస్ అధిష్టానం, హరీశ్ మిన్నకుండిపోయారు.

పుట్టుక, చావు టీఆర్ఎస్‌‌లోనే..
2014 ఎన్నికలు మొదలుకుని నేటి వరకూ హరీశ్‌‌-కేసీఆర్‌‌ను విడగొట్టాలని పలువురు భగీరథ ప్రయత్నాలు చేసి సక్సెస్ కాకపోవడంతో చేసేదేమీలేక సైలెంట్ ఉండిపోయారట. ఇదిలా ఉంటే సరిగ్గా ముందస్తు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఓ టీడీపీ నేత.. కేసీఆర్‌‌ను ఓడించాలని హరీశ్‌ చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వీటన్నింటికీ స్పందించిన ఆయన.. వారి ఆరోపణలకు ధీటుగా సమాధానిమిచ్చారు. అయితే గతంలోనే చాలా సందర్భాల్లో తన పుట్టుక, చావు రెండూ టీఆర్ఎస్‌లోనే అని హరీశ్ స్పష్టం చేసిన విషయం విదితమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.