close
Choose your channels

కౌశల్ 'సేనాని'

Saturday, January 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కౌశల్ సేనాని

రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 వివాదాల న‌డుమ విన్నర్‌గా నిలిచిన కౌశల్ మండ త్వరలోనే హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని విశ్వసనీయ వర్గాల సమాచారం. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ కాక ముందు కౌశ‌ల్ అంటే ఎవ‌రో పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. కానీ బిగ్‌బాస్‌లో విన్న‌ర్‌గా నిల‌వ‌డం కౌశ‌ల్‌కి మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.

కౌశల్ ఆర్మీ పేరుతో బిగ్‌బాస్ సీజన్ 2లో సెన్సేషన్ క్రియేట్ చేసి విజేత నిలిచిన కౌశల్‌ను, బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో నటింప చేయడానికి ప్రయత్నాలు జరిగాయనేది వాస్తవం. మ‌హేష్ `మ‌హ‌ర్షి`లో కౌశ‌ల్ న‌టిస్తున్నాడ‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే హీరోగా కౌశల్ సినిమాలేవీ కమిట్ కాలేదు.

అందుకు కారణం.. వచ్చిన క్రేజ్‌తో హీరోగా ఎదగాలనుకున్నాడు కౌశల్. తాజా సమాచారం ప్రకారం మెగా హీరోలకు సన్నిహితుడైన నిర్మాత ఒకరు కౌశల్‌తో సినిమా చేయబతున్నారని.. కొత్త దర్శకుడితో చేయబోయే ఈ సినిమాకు ‘సేనాని’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని కూడా వార్తలు వినపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.