ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. ఒక ప్రమాదాలకు నో ఛాన్స్ ‘‘క‌వ‌చ్’’ వచ్చేసిందిగా

  • IndiaGlitz, [Friday,March 04 2022]

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నా దేశంలో నిత్యం ఏదో ఒక మూల రైలు ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. ఆయా ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే.. అంగవైకల్యం పొందిన వారు ఇంకొందరు. వీటికి చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటూనే వుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా రైల్వే శాఖ అరుదైన విజయం సాధించింది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు వచ్చినా.. ఢీకొట్టకుండా అందుబాటులోకి తీసుకొచ్చిన ‘‘కవచ్’’ సాంకేతికతను రైల్వే శాఖ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. క‌వ‌చ్ వ్య‌వ‌స్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌స్తే.. ఒకే ప‌ట్టాల‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు వ‌చ్చినా... అవి ఢీ కొట్టుకోవు. అల్లంత దూరాన వుండగానే త‌మ‌కు తాము బ్రేకులేసుకుని మ‌రీ నిల‌బ‌డిపోతాయి.

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో లింగంప‌ల్లి- వికారాబాద్ సెక్షన్‌లో ఈరోజు రైల్వే మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్‌, రైల్వే బోర్డు చైర్మ‌న్ విన‌య్ కుమార్ త్రిపాఠిల స‌మ‌క్షంలో క‌వ‌చ్ టెస్ట్ డ్రైవ్ జ‌రిగింది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా ప్ర‌యాణిస్తున్న రెండు రైళ్ల‌లో.. ఒక దానిలో రైల్వే మంత్రి, మ‌రో దానిలో రైల్వే బోర్డు చైర్మన్ ప్రయాణించారు. ఈ రెండు రైళ్లు వాటి మ‌ధ్య దూరం 380 మీట‌ర్లు ఉండ‌గానే.. వాటిలో అప్ప‌టికే అమ‌ర్చిన క‌వ‌చ్ వ్యవస్థ అలెర్ట్ అయిపోవడంతో రెండు రైళ్లు వాటిక‌వే బ్రేకులేసుకుని ఆగిపోయాయి.

ఇక మ‌రో టెస్ట్ డ్రైవ్‌ సందర్భంగా మ‌లుపు ఉన్న చోట పైల‌ట్ అనుమ‌తి లేకుండానే రైలు త‌న వేగాన్ని త‌న‌కు తానే గంట‌కు 30 కిలో మీట‌ర్ల‌కు త‌గ్గించేసుకుంది. అలాగే క్రాసింగ్ ఉన్న చోట కూడా రైలు త‌న వేగాన్ని నియంత్రించుకోవడం విశేషం. మరో టెస్ట్ డ్రైవ్‌లో రెడ్ సిగ్న‌ల్‌ను దాటేసి పోతున్న రైలు త‌న‌ను తాను నియంత్రించుకుని నిలిచిపోయింది. ఇలా మూడు టెస్ట్‌ల్లోనూ క‌వ‌చ్ విజయవంతమైంది.

More News

ప్రాజెక్ట్ కే : మీ సాయం కావాలి.. ఆనంద్ మహీంద్రాకు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్‌లో బిజీగా వున్నారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘‘హను మాన్’’ నుంచి వరలక్ష్మీ ఫస్ట్‌లుక్.. మరోసారి జయమ్మ ఉగ్రరూపం

తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు.

హీరోయిన్ కాకుండా వుంటే.. కోహ్లీలా వుండేదేమో: సమంతపై జిమ్ ట్రైనర్ ప్రశంసలు

హీరోలతో పోలిస్తే హీరోయిన్ల స్టార్‌డమ్, కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మంచి అవకాశాలొచ్చి, ఆ సినిమాలు హిట్టయితే ఐదేళ్లు,

అందుకే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను చంపాలనుకున్నా : నిందితుడు రాఘవేంద్రరాజు

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

అసెంబ్లీకి ఆ అధికారం లేదు.. ఏ కార్యాలయాన్ని తరలించొద్దు: అమరావతిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.