close
Choose your channels

డిసెంబ‌ర్ 7న క‌వ‌చం విడుద‌ల‌..

Wednesday, November 28, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డిసెంబ‌ర్ 7న క‌వ‌చం విడుద‌ల‌..

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో వ‌స్తున్న‌ సినిమా క‌వ‌చం. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. టీజ‌ర్ 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుని.. అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో శ్రీ‌నివాస్ మామిళ్ళ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

కెరీర్‌లో తొలిసారి ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. హర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే క‌వ‌చం షూటింగ్ పూర్తైంది.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ సంస్థ‌లో న‌వీన్ సొంటినేని(నాని) క‌వ‌చం సినిమాను నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.