నగర ప్రజానీకంపై కేసీఆర్ వరాల జల్లు

  • IndiaGlitz, [Monday,November 23 2020]

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్భంగా పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలతో సిద్ధమైపోయాయి. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో ఈ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోని ప్రజలను ఆకట్టుకునే హామీలతో మేనిఫెస్టోను తయారు చేసింది. టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజానీకంపై వరాల జల్లు కురిపించారు. డిసెంబర్‌ నుంచి వాటర్‌ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తన మేనిఫెస్టోలో ప్రకటించారు. 98శాతం ప్రజలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌లకు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీలో వర్షాలకు దెబ్బతిన్న దోబీఘాట్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. అలాగే లాక్‌డౌన్‌ సమయంలో మోటార్‌ వాహనాల పన్ను రద్దు చేస్తామని తెలిపారు.

More News

ప‌వ‌న్ 27లో ఇస్మార్ట్ బ్యూటీ..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

కోవిడ్ ప్ర‌భావంతో లాక్‌డౌన్ విధించ‌డం, ఫ‌లితంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చాలా న‌ష్టం జ‌రిగింది.

డ‌బుల్ డోస్ ఇస్తామంటున్న హిట్ కాంబో...

13 ఏళ్ల ముందు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన చిత్రం ‘ఢీ’. సరికొత్త స్టైల్లో ఫన్‌తో తెర‌కెక్కిన చిత్రం అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

తమిళనాడు తెలుగు విలేకరి దారుణ హత్య

తమిళనాడులో తెలుగు జర్నలిస్ట్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.

సమంత పోస్టుపై అఖిల్ కామెంట్

అక్కినేని వారి కోడలు సమంత ఓ ఫోటోని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఆ పోస్టుపై ఆమె మరిది.. హీరో అఖిల్ స్పందించాడు.