close
Choose your channels

కేసీఆర్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. 10 మంది ప్రమాణం!

Friday, February 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ మంత్రి వర్గవిస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు నెలలకు పైగా అయ్యింది. ఎప్పుడో జరగాల్సిన కేబినెట్ విస్తరణ ప్రక్రియకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసేశారు. మంగళవారం అనగా ఫిబ్రవరి-19న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌‌ నరసింహన్‌‌ను కలిసిన కేసీఆర్ విస్తరణపై సుధీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం టీఆర్ఎస్ సర్కార్ నుంచి అధికారికంగా సమాచారం వచ్చింది. కాగా మంగళవారం ఉదయం 11:30 గంటలకు 8 నుంచి 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

కాగా ఇప్పటికే పాత వారిని ఎంతమందిని కొనసాగించాలి..? ఎంత మంది కొత్తవాళ్లను కేబినెట్‌లోకి తీసుకోవాలి..? ఏ సామాజిక వర్గానికి ఎన్నెన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? ఏ జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? ఇతర పార్టీల నుంచి వచ్చే కీలకనేతలెవరు.. వచ్చే వాళ్లకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా..? ఇలా అన్నింటిపై కసరత్తు చేసే ఫైనల్‌‌ కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసేశారు. కాగా ఈ కేబినెట్‌‌ విస్తరణలో పలువురు పాత మంత్రులకు కేసీఆర్ ఝలక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

కాగా ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వర్గ విస్తరణ ఫలానా రోజు ఉంటుందని ముందే తెలుసుకున్న పలువురు గులాబీ నేతలు ప్రగతి భవన్ ‌‌చుట్టూ ప్రదిక్షణలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ ఆశావహుల దెబ్బకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రగతి భవన్‌‌కు వెళ్లడమే మానేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారం చేయబోయే పది మంది వీళ్లేనా..!?

డిప్యూటీ సీఎం, విద్యాశాఖ: కడియం శ్రీహరి

ఆర్థిక మంత్రి: ఈటెల రాజేందర్

ఐటీ, పంచాయితీరాజ్: కేటీఆర్

నీటిపారుదలశాఖ: తన్నీరు హరీశ్

వ్యవసాయ శాఖ: తలసాని శ్రీనివాస్ యాదవ్

పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ: దానం నాగేందర్

రోడ్డు,భవనాల శాఖ: పువ్వాడ అజయ్

క్రీడా శాఖ: బాల్క సుమన్

ఆరోగ్య శాఖ : సీహెచ్ మల్లారెడ్డి

రవాణాశాఖ: పట్నం నరేందర్ రెడ్డి

పై పదిమంది మంగళవారం నాడు ప్రమాణం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరితో పాటు సీనియర్, మాజీ మంత్రులు నాయిని, తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం వీరికి ఏ పదవి లేనప్పటికి మున్ముంథు ఎమ్మెల్సీలను చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఫిబ్రవరి 22 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఎంత మంది మంత్రులుగా అసెంబ్లీలోకి అడుగుపెడతారో..? ఎంత మంది యథావిథిగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా అసెంబ్లీకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.