పదో తరగతి పరీక్షలపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ..

  • IndiaGlitz, [Wednesday,May 06 2020]

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదో తరగతి పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోనళపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలు పెంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని.. భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్‌ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఖచ్చితంగా ఈ నెలలోనే టెన్త్‌ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ మే-06 నుంచి ప్రారంభమవుతుందని కేసీఆర్ తెలిపారు. ఇవాళ 7 గంటల పాటు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్త్ పరీక్షలపై నిశితంగా చర్చించి.. ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ తెలిపారు.

ఇప్పటికే 1 నుంచి 9వరకు పరీక్షలుండవ్..

ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు పరీక్షలుండబోవని ఇదివరకే రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే.. ఎలాంటి సంవత్సర పరీక్షలు లేకుండానే వీరిని నేరుగా తర్వాతి తరగతికి పంపుతారని అర్థం. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019-20 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులను ఎటువంటి పరీక్షలూ లేకుండా నేరుగా 2020-21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం పంపించనుంది.

More News

కరోనాతో కలిసి బతకాల్సిందే..: కేసీఆర్

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌తో మనం కలిసి బతకాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో

నటుడు శివాజీరాజాకు హార్ట్ ఎటాక్

టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. బీపీ డౌన్ అవ్వడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తున్నాం : కేసీఆర్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ 7 గంటల పాటు

ప‌వ‌న్‌తో మ‌ళ్లీ ప‌నిచేయాల‌నుకుంటున్న బాపు బొమ్మ‌

క‌న్న‌డ బ్యూటీ ప్ర‌ణీత సుభాష్ క‌రోనా ప్ర‌భావంతో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌వారికి ఆహారాన్ని అందిస్తుంది. ఆహారాన్ని త‌యారు చేసి స్వ‌యంగా ఆమె పేద‌వారికి పంచుతుండ‌టం విశేషం.

డైరెక్ట‌ర్‌కు భూ కేటాయింపులు.. స‌ర్కార్‌కు కోర్టు నోటీసులు

తెలంగాణ ప్ర‌భుత్వం సినీ రంగ అభివృద్ధికి చాలా ప్రాముఖ్య‌త ఇస్తుంది. చాలా సంద‌ర్భాల్లో ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం బ‌హిరంగంగానే ప్ర‌క‌టించింది కూడా. తెలంగాణ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు