ట్రంప్‌తో విందుకు కేసీఆర్.. ప్రత్యేక ఆహ్వానం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 25న విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు హాజరు కావాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ విందు కేవలం 90 నుంచి 95 మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానాలు అందటం ఆసక్తి కలిగించే అంశం కాగా.. అందులో కేసీఆర్‌కు కూడా ఆహ్వానం రావడం విశేషమని చెప్పుకోవచ్చు.

వాస్తవానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు కేసీఆర్ సర్కార్ గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికి అన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నారు. కాగా.. ట్రంప్ కుమార్తె కూడా ఇప్పుడు భారత్‌కు వస్తున్నారు. ఇవాంకను కలవడం రెండోసారి కాగా.. ట్రంప్‌తో మాత్రం మొదటిసారి కేసీఆర్ కలవబోతున్నారన్న మాట.

More News

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 600 యాప్‌లు తొలగింపు!

అవును మీరు వింటున్నది నిజమే.. ఒకట్రెండు కాదు ఏకంగా 600 మంది యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడం జరిగింది.

రోజంతా లేడీస్‌ హాస్టల్‌లో విద్యార్థి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో..!

విద్యార్థినీలు ఉన్న హాస్టల్‌లోకి బాయ్స్‌కు అనుమతి ఉండదన్న విషయం తెలిసిందే. అయితే.. అబ్బే ఈ షరతులు అందరికీ వర్తిస్తాయ్ కానీ నాకు కాదు అనుకున్నాడేమో కానీ..

త‌రుణ్ భాస్క‌ర్ షాక్‌!!

షార్ట్ ఫిలింస్ నుండి `పెళ్ళిచూపులు` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన త‌రుణ్ భాస్క‌ర్ తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని న‌మోదు చేసుకోవ‌డ‌మే కాదు..

సాయి కుమార్ చేతుల మీదుగా కాలేజ్ కుమార్ ట్రైలర్ లాంచ్ !!!

ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ ని  తెలుగు లో రిమేక్ చేసాడు

'పలాస 1978' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి .. మార్చ్ 6న విడుదల

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’ .