close
Choose your channels

కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చేసిన కేసీఆర్

Sunday, February 10, 2019 • తెలుగు Comments

కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చేసిన కేసీఆర్

గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అనగా ఫిబ్రవరి 17న కేబినెట్ విస్తరణ ఉంటుందా..? బర్త్ డే రోజునే సడన్ సర్‌‌ఫ్రైజ్ ఇచ్చేందుకు బాస్ సన్నాహాలు చేస్తున్నారా..? ఇన్ని రోజులు కసరత్తులు చేసిన కేసీఆర్ ఇక ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. 

ఇప్పటికే ఇదిగో తెలంగాణ మంత్రులు జాబితా..? మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడానికి అసలు కారణాలివే..? కేసీఆర్‌‌కు జోస్యం పిచ్చితోనే విస్తరణ పనులు పూర్తి చేయలేదు? కేటీఆర్‌ను సీఎం చేయడానికే ఇన్ని రోజులు కేసీఆర్ ఆగారు..? హరీశ్‌‌ను తిన్నగా తప్పించడానికి..? ఆయన్ను పక్కనపెట్టడానికి ఇన్ని రోజులుగా కేసీఆర్ జాప్యం చేశారు..? అడ్డంకులన్నీ తొలగిన తర్వాత ఆరామ్‌‌గా సీఎం పీఠం కేటీఆర్‌‌ను కూర్చోబెట్టి.. తానెళ్లి ఢిల్లీలో కూర్చోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు..?అని ఇలా పలు రకాలుగా విమర్శకులు, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం విదితమే. 

ఫస్ట్ టైమ్‌‌ పెదవి విప్పిన గులాబీ బాస్..

ఇక ముందు విమర్శలన్నింటికీ దూరంగా ఉండాలని భావించిన కేసీఆర్ మరో ఐదారు రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల ప్రగతి భవన్‌‌లో జరిగిన సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు, ఆశావహులు బాస్‌‌ను ముహూర్తం ఎప్పుడు సార్ అని నవ్వుతూ అడగ్గా రాబోయే ఐదారు రోజుల్లో ఉంటుందని కేసీఆర్ చెప్పారు. కాగా కేబినెట్ విస్తరణ కేసీఆర్ పెదవి విప్పడం ఇదే ఫస్ట్ టైమ్..బహుశా ఇదే లాస్ట్ టైమ్ కూడా అవ్వొచ్చేమో. 

సెంటిమెంట్ ప్రకారమే..

కేసీఆర్‌‌ ఏ పనిచేసినా అసలు ఆ సమయం సరైనదా కాదా..? అచ్చొస్తుందా రాదా..? అని ఆచి తూచి అడుగులేస్తారు. మరీ ముఖ్యంగా తన సెంటిమెంట్ ప్రకారమే కొన్ని నంబర్లను ఆయన ఫాలో అవుతారు. అందుకే తన పుట్టిన రోజు ఫిబ్రవరి 17న కానీ లేదా ఒక రోజు ముందు కేబినెట్ విస్తరణ ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజమవుతుంది..? కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది..? ఎవరెవరికి కేబినెట్‌‌లో చోటు దక్కుతుంది..? ఎంతమంది ఆశావహులకు కేసీఆర్ షాకిస్తారు..? అనే విషయాలు మరో ఐదారు రోజులు వేచి చూడాల్సిందే మరి.