close
Choose your channels

ఏపీలో మరోసారి చక్రం తిప్పనున్న కేసీఆర్!

Tuesday, January 7, 2020 • తెలుగు Comments

ఏపీలో మరోసారి చక్రం తిప్పనున్న కేసీఆర్!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అయిపోయాయ్.. కేసీఆర్ అనుకున్నట్లుగానే వైఎస్ జగన్ పార్టీ గెలిచింది.. ప్రమాణం రోజున కూడా వెళ్లొచ్చారు కదా..? మళ్లీ ఈ ట్విస్టేంటి..? అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ఏపీ రాజకీయాల్లోనే కాదు.. ఏపీ ప్రభుత్వం చేపట్టే ప్రధాన ఘట్టాల్లో కేసీఆర్ కీలకం కాబోతున్నారు.! అసలేంటి.. ఈ చక్రం తిప్పుడు..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..? అనే విషయాలు తెలుసుకోవాలంటే www.indiaglitz.com అందిస్తున్న ఈ ఎక్స్‌క్లూజివ్ కథనం చదవాల్సిందే మరి.

ఎక్కడికక్కడ అరెస్ట్‌లు!
నవ్యాంధ్రలో మూడు రాజధానులుంటాయని దాదాపు స్పష్టమైంది.. మరో రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ రాజధాని రైతులు, కూలీలు, టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియా, సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఆందోళనకు పిలుపునిచ్చిన ప్రతిపక్షాలకు చెందిన సభ్యులను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు.. రాజధాని గ్రామాలు నివురుగప్పిన నిప్పులా మారిపోయాయ్.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు.. విజయవాడ, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు ఎక్కవైపోతున్నాయ్. అయితే ఈ దాడులు రైతులే చేస్తున్నారా..? లేకుంటే డబ్బులు పెట్టి చేయిస్తున్నారా..? అనేది ఇక్కడ అసందర్భం.. అప్రస్తుతం.!

మూడు రాజధానులపై కీలక చర్చ!
రాజధానిలో ఇలా పరిస్థితులున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్-వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ నెల 13న ప్రగతి భవన్ వేదికగా ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఆస్తుల విభజన, కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాల తరలింపు అంశంతో పాటు మరీ ముఖ్యంగా ‘నవ్యాంధ్రకు మూడు రాజధానులు’ వ్యవహారంపై నిశితంగా చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఫిక్స్ అయ్యింది.. అయితే తరలింపు ఒక్కటే కాస్త ఆలస్యమైంది. అయితే ఈ భేటీలో కేసీఆర్‌ నిశితంగా వివరించి.. సీనియర్, అనుభవజ్ఞుడు నుంచి జగన్ సలహాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు విషయాలపై చర్చించడానికి వివిధ సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్న సంగతి తెలిసిందే.

చక్రం తిప్పడమేనా..!?
వాస్తవానికి నవ్యాంధ్రకు మూడు రాజధానులుంటే తప్పేమీ లేదని ఇప్పటికే ఒకట్రెండు మీడియా ప్రతినిధులు తప్ప దాదాపు జాతీయ మీడియా సైతం జగన్ నిర్ణయాన్ని బేష్ అన్నది. అంతేకాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అనేది లోపించడంతోనే తెలంగాణలో ‘ప్రత్యేక పోరు’ నెలకొంది. అందుకే మూడు రాజధానులను కేసీఆర్ ఒప్పుకుని.. ఏపీ ప్రజలకు వివరించడానికి భేటీ తర్వాత ప్రెస్‌మీట్ లేదా అవసరమైతే ఏపీకి వచ్చి మరీ బహిరంగ సభలో పాల్గొంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. ఇదే జరిగితే ప్రతిపక్షాలకు చెంప పెట్టులాగా.. మరోసారి జగన్‌కు ప్రేమతో.. ఆంధ్రా ప్రజలకు మనస్పూర్తిగా మద్దతిచ్చి చక్రం తిప్పుతారని టీఆర్ఎస్ శ్రేణుల నుంచి సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో..? తెలియాలంటే ఈ నెల 13 వరకు వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz