close
Choose your channels

జూన్‌ నుంచి టాలీవుడ్ షూటింగ్‌లు ప్రారంభం.. కేసీఆర్ హామీ

Friday, May 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌లు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

సీఎం కేసీఆర్ ఏం చెప్పారు..!?

సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీలో టాలీవుడ్ పెద్దలు పలు అంశాలపై చర్చించడంతో పాటు విజ్ఞప్తులు చేశారు. జూన్‌లో సినిమా షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. షూటింగ్స్, రీ ప్రొడక్షన్స్ దశలవారీగా పునరుద్ధరణ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేస్తుందని.. అవి పాటిస్తూ షూటింగ్‌లు చేసుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమపై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారన్నారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న రీ- ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సినీ పెద్దలతో సీఎం చెప్పారు. సినిమా షూటింగ్‌లు మొదలయ్యాక థియేటర్ల ఓపెన్‌పై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. సినిమా షూటింగ్‌లు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు.

పరిస్థితిని థియేటర్లు ఓపెనింగ్..

చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సీఎం అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు.

త్వరలో మార్గదర్శకాలు..

ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సీఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత, అప్పటికే పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని టాలీవుడ్ పెద్దలకు సీఎం చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.