కాకతాళీయంగా జరిగింది.. సహృదయంతో అర్థం చేసుకోండి: కేసీఆర్

  • IndiaGlitz, [Friday,July 10 2020]

తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణం కోసం పాత భవనాలను కూల్చి వేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి అవి కాస్త దెబ్బతిన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొత్త సచివాలయం నిర్మించడమే తమ ఉద్దేశమని ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖర్చుతో దేవాలయం, మసీదులను నిర్మించి, వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘‘కొత్త భవన సముదాయం నిర్మించడానికి ఎత్తయిన భవనాలు కూల్చే క్రమంలో ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిందని తెలిసి ఎంతో బాధపడుతున్నాను... చింతిస్తున్నాను. కొత్త సచివాలయం నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. పూర్తి ప్రభుత్వ ఖర్చుతో దేవాలయం, మసీదులను నిర్మించి, వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తాం. నిర్వాహకులతో త్వరలోనే సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి’’ అని కేసీఆర్ ట్వీట్‌లో కోరారు.

More News

ఆది సాయికుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం

బాహుబ‌లితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. అప్ప‌టి నుండి మ‌న టాలీవుడ్ హీరోలంద‌రూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఏపీలో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు 

ఏపీలో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం గమనార్హం.

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కొట శ్రీనివాస‌రావు

విల‌క్ష‌ణ న‌టుడు కొటాశ్రీనివాస‌రావు వేయ‌ని పాత్ర‌లు లేవ‌నే చెప్పాలి.. భార‌త‌దేశం లో  సుమారు అన్ని భాష‌ల్లో న‌టించి మెప్పించిన గొప్ప లెజండ‌రి యాక్ట‌ర్ ఆయ‌న‌.

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 11గా నిర్మించిన చిత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`.

2 రోజులుగా అంబులెన్స్‌లోనే నిండు గర్భిణి.. చివరకు..

నిండు గర్భిణి.. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల పాటు అంబులెన్స్‌లోనే జంట నగరాల్లోని పలు హాస్పిటల్స్ తిరిగింది.