అయినా కిరికిరి పెడుతున్నారు నా కొడుకులు..: కేసీఆర్

  • IndiaGlitz, [Sunday,November 29 2020]

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీపై సెటైర్లు వేశారు. బీజేపీ అగ్ర నాయకత్వం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై ఆయన స్పందిస్తూ.. బక్క కేసీఆర్‌ని కొట్టేందుకు ఎంతమంది వస్తారని ప్రశ్నించారు. ఇవేమైనా జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలా? మునిసిపల్ ఎన్నికలే కదా.. దీనికి యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. వరదల్లో మునిగినం.. ఆదుకోండని రూ.1300 కోట్లు అడిగితే రూ.13 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అదే ప్రధాని మోదీ బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకు సాయం చేశారని, ఏం మనం భారతదేశంలో లేమా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..

నేను ఢిల్లీ పోతున్నానని వణుకు పుట్టింది..

నేను ఢిల్లీ పోతున్నానని అక్కడి వాళ్లకు వణకు పుట్టింది. అందుకే నన్ను ఇక్కడే అణగదొక్కాలని అందరూ ఇక్కడికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎంకు టికానానే లేదు. ఆయన నాకు నీళ్లిస్తాడట.. యూపీ ర్యాంకుల పరంగా 25వ స్థానంలో ఉంది. 25వ ర్యాంకోడు వచ్చి ఐదో ర్యాంక్‌లో ఉన్న మనకు చెప్తాడట. టెంటే లేదు కానీ ఫ్రెంట్ పెడతారట అంటున్నారు.. అసలు ఫ్రెంట్ పెడుతున్నా అని ఎవడు చెప్పిండు? తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి మాటలే అన్నారు. అయినా, వారి సొంత రాష్ట్రాల్లో ఉద్ధరించలేనివాళ్లు ఇక్కడకొచ్చి ఏంచేస్తారు? కరెంట్‌ ఉండదు, నీళ్లు రావు, పరిశ్రమలు వెళ్లిపోతాయన్నారు.హైదరాబాద్‌ ఖాళీ అవుతుందని శాపాలు పెట్టారు.అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌ను విశ్వసించారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు ఎక్కడా ఆర్థిక సాయం అందించలేదు..

ముంబైని 10 రోజులకుపైగా వరద ముంచెత్తింది. చెన్నైని 21 రోజులకుపైగా వరద ముంచెత్తింది. ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు కూడా వరద ముప్పు తప్పలేదు.హైదరాబాద్‌ నగరానికి వరద కష్టం వస్తే...మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజల దగ్గరకే వెళ్లి సహాయక చర్యలు అందించారు.ఆ దృశ్యాలను చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి. ఇంటికి రూ.10వేల సహాయం అందించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నా. బీజేపీ, కాంగ్రెస్‌లు పరిపాలించే ఏ నగరంలోనూ ఆర్థికసాయం అందించలేదు. అయినా కిరికిరి పెడుతున్నారు నాకొడుకులు.. బాధతో ఈ మాట అంటున్నా ఎన్నికల అయిపోయాక డిసెంబర్‌ 7 నుంచే అర్హులైన వారందరికీ రూ.10వేల వరద సాయం అందిస్తాం.

మీ తలపుండు కడిగేది నేనే..

ఇతర రాష్ట్రాల నుండి వచ్చినోడిది నెత్తి కాదు.. కత్తి కాదు.. మాటలు చెప్పి పోతారు... మీ తలపుండు కడిగేది నేనే.. ఆలోచించండి. హైదరాబాద్‌ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డా మావారే అని చెప్పాం. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని మా బిడ్డలుగానే చూస్తున్నాం. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? అనే చర్చ ప్రజల్లో జరగాలి. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఓటు వేసేముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. పార్టీలకు ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలి. అప్పుడే మంచినేతలు రాజకీయాల్లో ఉంటారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి.

More News

హారిక, అభిలను వీడియోలు చూపిస్తూ చెడుగుడు ఆడేసిన నాగ్...

‘మిరా మిరా మీసం..’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నిన్న ఏం జరిగిందనేది చూశారు.

కేసీఆర్‌కే ఝలక్.. ఆయన మాట్లాడుతుండగా..

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించింది.

వైట్ రైస్ తింటున్నారా? ఈ విషయం తెలిస్తే...

మనం తినే అన్నం తెల్లగా మల్లెపూవులా ఉండాలని అంతా భావిస్తూ ఉంటాం. అది ఆరోగ్యానికి చాలా హానికరమని కొందరికి మాత్రమే తెలుసు. తెల్లటి అన్నాన్ని రోజూ తింటున్నారా?

ప్రభాస్ 'ఆదిపురుష్‌'లో సీత ఎవరంటే..?

తొలి చిత్ర‌మే సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం పొందింది కృతి స‌న‌న్‌. మోడ‌లింగ్ నుంచి సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కృతికి ఆ చిత్రం (1 - నేనొక్క‌డినే) పేరు

బాలీవుడ్ కి వెళుతున్న ఎన్టీఆర్ చిత్రం

తెలుగు సినిమాల కంటెంట్ మారుతోంది. డిఫరెంట్ సినిమాలు చూడటానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తుండ‌టంతో మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా అలాంటి సినిమాలు చేయ‌డానికే ఆస‌క్తి చూపుతున్నారు.