ఏపీలో ఏమవుతుందో దేవుడికే తెలియాలి.. నేనూ చూస్తా!

  • IndiaGlitz, [Thursday,October 24 2019]

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా ఏపీలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే తెలంగాణలో కూడా విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కార్మికుల యూనియన్లు పట్టుబట్టాయి. అయితే సర్కార్ మాత్రం కుదరదంటే కుదరదని తేల్చిచెప్పింది.. దీంతో కార్మికులు సమ్మెకు దిగడం.. అదికాస్త 20 రోజులు పూర్తవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ ఈ వ్యవహారాన్ని లైట్‌గా తీసుకున్న కేసీఆర్ తాజాగా మీడియా ముందుకు వచ్చి తేల్చేశారు. అంతేకాదు.. ఈ క్రమంలో ఏపీలో ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నేను కూడా చూస్తా!

‘ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడానికి కమిటీ వేసిందే కానీ.. అది ఏమవుతోందో దేవుడికే తెలియాలి. ఆ కమిటీ ఇంకా మూడు, ఆరు నెలల్లో నివేదిక ఇస్తుంది. ఏపీలో జగన్ కమిటీ వేశారేకానీ.. విలీనం చేయలేదని, అది కేవలం ప్రయోగం మాత్రమే. అక్కడ ఏమవుతుందో నేను కూడా చూస్తాను’ అని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మొత్తం మీరే చేశారు..!

‘ఆర్టీసీ కార్మికులను ఎవరూ వెళ్లగొట్టలేదు. వారికి వారే డిస్మిస్ చేసుకున్నారు. అమాయక కార్మికుల ఉద్యోగాలను తొలగించడం సమంజసం కాదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వాళ్లు అంత అమాయకులు కాదు.. వాళ్లు నిజంగానే అమాయకులైతే డిపోలకు వెళ్లి విధుల్లో చేరే వారు. కానీ అలా జరగలేదు.. దీనికంతటికీ ఆర్టీసీ యూనియన్లే కారణం.. కార్మికుల్లో పిచ్చి ఆలోచనలను జొప్పించి.. వాళ్ల బతుకులను ఆగం చేస్తున్నారు’ అని యూనియన్లపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నాకున్న అవగాహన ఇంకెవరికీ లేదు!

‘ఆర్టీసీ విషయంలో తనకున్న సానుభూతి, లోతైన అవగాహన ఇంకెవరికీ ఉండదు. గతంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తెచ్చాను. విశాఖపట్టణం బస్టాండ్‌కు వెళ్లి టాయిలెట్లను కూడా పరిశీలించాను. వైస్రాయ్ హోటల్‌లో కార్మికులతో కూర్చొని మాట్లాడి.. సమస్యను పరిష్కరించాను. అందుకే ఆర్టీసీ గురించి అన్నీ తెలిసిన వాడిగా మాట్లాడుతున్నాను’ అని సీఎం కేసీఆర్ గతంలో జరిగిన విషయాలను ఉదహరించి మరీ చెప్పారు.

More News

‘బిత్తిరి సత్తి’ లైఫ్‌లో జరిగిన బాధాకరమైన విషయాలివీ!

బిత్తిరి సత్తి.. ఈ పేరు తెలియని వారు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. కాస్త టీవీ చూసే అలవాటు ఉంటే ఇక కొత్త పరిచయం చేయనక్కర్లేదు. ఇతని ఒరిజనల్ పేరు రవికుమార్.

ఆర్టీసీపై తేల్చేసిన కేసీఆర్.. సింగిల్ సంతకంతో...!!

ఆర్టీసీ మునగక తప్పదని.. దాన్ని ఎవరూ కాపాడలేరని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 20 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే.

హుజూర్‌నగర్‌లో ‘కారు’ గెలుపు ఆషామాషీ కాదు!

తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కలలో కూడా ఊహించని భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

నాని నిర్మాణంలో విశ్వ‌క్ సేన్ హీరోగా ప్రారంభ‌మైన `హిట్‌`

హీరోగా ప‌లు వైవిధ్య‌మైన చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించి త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నేచుర‌ల్ స్టార్ నాని. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే క్ర‌మంలో..

న‌రేష్ వివ‌ర‌ణ‌..జీవిత ఘాటు స్పంద‌న‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) వివాదం రోజు రోజుకు పెరుగుతూ వ‌స్తుంది. రీసెంట్‌గా జ‌రిగిన ప్రెస్‌మీట్ అనంత‌రం ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తామ‌ని