మాజీ హోంమంత్రి నాయినిని పరామర్శించిన కేసీఆర్..

  • IndiaGlitz, [Wednesday,October 21 2020]

మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. బుధవారం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి నాయినిని చూసేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లారు. అనంతరం వైద్యులతో మాట్లాడి నాయిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నిమోనియాతో బాధపడుతున్న నాయినికి వైద్యులు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు. సెప్టెంబర్ 28న నాయినికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. దీంతో ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లి పోయారు. ఆరోగ్యం కుదుటపడిందని ఆనందించే లోపే ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. ఈ క్రమంలోనే ఆయన మరోమారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. కాగా.. నేడు సీఎం కేసీఆర్ వెళ్లి నాయినిని పరామర్శించారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు

More News

ఆ డైరెక్టర్‌తో చరణ్‌కి ఈసారైనా వర్కవుట్‌ అయ్యేనా..?

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివకు ఎందుకనో సినిమా కుదరడమే లేదు. ప్రారంభంలో వీరిద్దరి కలిసి 'మెరుపు'

లారెన్స్‌ 'లక్ష్మీబాంబ్‌'కు కొత్త సమస్య

రాఘవ లారెన్స్‌ బాలీవుడ్‌ డెబ్యూ మూవీ 'లక్ష్మీబాంబ్‌'ను ఏ ముమూర్తాన స్టార్ట్‌ చేశారో కానీ.. సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

‘కళాపోషకులు’ టీజ‌ర్ విడుద‌ల‌..

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’.

మలయాళ రీమేక్‌లో కలెక్షన్‌ కింగ్‌

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు.. ఈ మధ్య కాలంలో చాలా సెలక్టివ్‌గానే సినిమాలను యాక్సెప్ట్‌ చేస్తున్నారు.

విరిగిపడిన కొండ చరియలు.. ఐదారుగురున్నట్టు అనుమానం..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్ల కింద ఐదారుగురు శానిటేషన్‌ సిబ్బంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.