Kadiyam vs Rajaiah: కడియంకు చెక్‌ పెట్టేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. ఎంపీగా రాజయ్య పోటీ!

  • IndiaGlitz, [Friday,March 29 2024]

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలంతా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. పార్టీలో అగ్రనేతగా ఉన్న కేకేతో పాటు కడియం శ్రీహరి కూడా హస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కడియం ఇంటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ తరపున వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి నిలబడతారని తెలుస్తోంది. దీంతో కడియం తీరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో కడియంకు చెక్‌ పెట్టాలని డిసైడ్ అయ్యారు. కడియం కోసం మాజీ మంత్రి తాటికొండ రాజయ్యను పక్కన పెట్టామని.. కానీ కష్టకాలంలో కడియం పార్టీని వదిలివెళ్లడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనకు ఎలాగైన బుద్ధి చెప్పాలన్న యోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెలేగా ఉన్న తాటికొండ రాజయ్యపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేసి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్‌ను కడియం దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, తన కుమార్తెకు కూడా ఎంపీ టికెట్ రాబట్టుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కడియం కుమార్తెకు టికెట్ ఇవ్వడంతో ఆయన బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కడియం కుటుంబానికి ఇంత చేసినా కష్టకాలంలో పార్టీకి నమ్మకద్రోహం చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆయనకు చెక్ పెట్టాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్యను మళ్లీ పార్టీలో చేర్చుకుని కడియంపై ఎంపీగా పోటీలో నిలబెట్టాలని వ్యూహాలు రచిస్తున్నారట. ఈ మేరకు రాజయ్యను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినప్పటికీ నాయకత్వం ఆదేశాలతో కడియం విజయానికి రాజయ్య పనిచేశారు. అధికారంలోకి వస్తే ఎంపీగా కానీ మరో కీలక పదవి ఇస్తామని రాజయ్యకు కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఆయన ఆశలన్ని ఆవిరైపోయారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేశారు. ఇప్పుడు కడియంపై ప్రతీకారం తీర్చుకునే సమయం రావడంతో రాజయ్య కూడా ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారట. తన రాజీనామాను ఉపసంహరించుకుని మరోసారి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారట. మొత్తానికి వరంగల్ జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.

More News

Pawan Kalyan:పిఠాపురం కేంద్రంగా పవన్ కల్యాణ్‌ ప్రచారం.. తొలి విడత షెడ్యూల్ విడుదల..

ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేస్తుండగా..

Tamilisai: ఎన్నికల్లో వరుస ఓటములపై తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన వ్యాఖ్యలు

గతంలో తాను పోటీ చేసి అన్ని ఎన్నికల్లో ఓడిపోవడంపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) సంచలన వ్యాఖ్యలు చేశారు.

TDP Final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల.. గంటా పోటీ అక్కడి నుంచే..

పెండింగ్‌లో ఉన్న నాలుగు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్

Kadiyam Srihari:ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. కడియంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్

వెళ్లాలని భావిస్తున్న మాజీ మంత్రి కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR:కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం.. ఫిరాయింపులపై కేటీఆర్ ట్వీట్..

ఉద్యమ పార్టీగా 14 సంవత్సరాలు పోరాటాలు చేసి.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ పార్టీ