మెగా ఫ్యామిలీతో కీర‌వాణి సెంటిమెంట్‌..!

మెగాస్టార్‌.. ఆయ‌న న‌ట వార‌సులుగా ఇండ‌స్ట్రీలో చాలా మంది ప‌రిచ‌యం అయ్యారు. అయితే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి ఇందులో కొంత మందితోనే ప‌నిచేశారు. అందులో కొణిదెల ఫ్యామిలీ హీరోల‌ను చూస్తే.. కీర‌వాణికి, ఈ హీరోల‌కు ఓ సెంటిమెంట్ ఉంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి, కీర‌వాణి తొలి చిత్రం ఘ‌రానా మొగుడు ఇండ‌స్ట్రీ హిట్‌. త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌, కీర‌వాణి క‌లిసి ప‌నిచేసిన మ‌గ‌ధీర కూడా ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది.

ఇప్పుడు కీర‌వాణి మ‌రో మెగా ఫ్యామిలీ స్టార్ హీరో..ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో కీర‌వాణి ప‌నిచేస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు(ప‌రిశీలన‌లో ఉన్న‌ట్లు వినిపిస్తోన్న టైటిల్‌). దీనికి కీర‌వాణి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. సెంటిమెంట్ ప్ర‌కారం చూస్తే.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈసారి ఇండ‌స్ట్రీ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మ‌రి ఈ సెంటిమెంట్ ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి మ‌రి. పవన్ కల్యాణ్ 27వ చిత్రంగా తెరకెక్కుతోన్న హరి హర వీరమల్లు పీరియాడికల్ మూవీ. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో నటిస్తుంటే.. నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

More News

‘స‌లార్‌’ .. ప్ర‌శాంత్ నీల్ స్పీడు మామూలుగా లేదుగా..!

ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన త‌ర్వాత ఆయ‌న కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.

ఉప్పెన' క్లైమాక్స్ ట్రోల్స్ పై వైష్ణవ్ తేజ్ స్పందన

ఉప్పెన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగడానికి రెండు మూడు రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో సినిమా క్లైమాక్స్ గురించి విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్రమాదకరమైన సన్నివేశం ఒకటుందనీ

నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మదిరిగేలా 'రంగమ్మత్త' రిప్లయ్!

సినిమా సెలబ్రిటీలపై.. మరీ ముఖ్యంగా నటీమణులపై నిత్యం ఎవరో ఒకరు విమర్శించడం.. సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా కామెంట్స్ చేయడం కొందరు నెటిజన్లకు షరామామూలైపోతోంది.

హీరో సూర్య‌కి క‌రోనా పాజిటివ్‌

హీరో సూర్య‌కి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

‘స‌లార్’ కోసం బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్‌...

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుస‌గా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ‘రాధేశ్యామ్‌’ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉండ‌గా ..