విశాల్ తో కీర్తిసురేష్....?

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ తెచ్చిపెట్టిన చిత్రం పందెంకోడి. 2005లో విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధమైంది. విశాల్ ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.ఈ నెలలో సెట్స్ లోకి వెళుతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో సినిమా ఆగిపోయిందంటూ విశాల్ ప్రకటించాడు...మ‌ళ్లీ సినిమా ప్రారంభం అవుతుంద‌ని సోష‌ల్ మీడియాలో తెలియ‌జేశాడు. పందెంకోడి సీక్వెల్‌కు యువ‌న్‌శంక‌ర్ రాజా మ్యూజిక్ అందిస్తుండ‌గా, మ‌ది సినిమాటోగ్రఫీ చేస్తాడ‌ట‌.

త్వ‌ర‌లోనే మ‌రిన్ని విశేషాలు తెలియ‌జేస్తాని విశాల్ అన్నాడు అయితే లింగుస్వామి బ‌న్ని సినిమాను ప్ర‌క‌టించాడు. లింగుస్వామి బ‌న్ని సినిమాను పూర్తి చేసేలోపు విశాల్ మిస్కిన్ సినిమాతో పాటు మ‌రో సినిమాను కూడా పూర్తి చేసేస్తాడ‌ట‌. త‌ర్వాత‌నే పందెంకోడి సీక్వెల్ స్టార్ట‌వుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త‌మిళంలో విజ‌య్ వంటి స్టార్ హీరోల‌తో పాటు న‌టిస్తూ కీర్తిసురేష్ బిజీ హీరోయిన్‌గా మారింది.

More News

చైతు మూవీ రైట్స్ ద‌క్కించుకున్న టాప్ ప్రొడ్యూస‌ర్..!

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్ ద‌స‌రా కానుక‌గా రిలీజై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ సంతోషంలో చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ సినిమా శాటిలైట్ హక్కులను సొంతంచేసుకున్న...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఆ వార్తల పై క్లారిటి ఇచ్చిన బ్రహ్మి..!

హస్య బ్రహ్మ బ్రహ్మానందం డైరెక్షన్ చేయబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

కొరియోగ్రాఫ‌ర్ తో ప‌వ‌ర్ స్టార్ సెల్ఫీ..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.... త‌నతో వ‌ర్క్ చేసే ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్  తో చాలా స‌ర‌దాగా ఉంటారు. అందుక‌నే ప‌వ‌న్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తుంటారు. ఇక ప‌వ‌న్ తో వ‌ర్క్ చేసే అవ‌కాశం వ‌చ్చింది అంటే ఆ ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ ఫుల్ హ్యాపీగా ఫీల‌వుతుంటారు.

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీలో బాలీవుడ్ భామ‌..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్ కి పూర్త‌వుతుంది. ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.