విక్రమ్ తో కీర్తి సురేష్...

  • IndiaGlitz, [Thursday,May 04 2017]

డిఫ‌రెంట్ క‌థ‌లు, కాన్సెప్ట్‌లు, గెట‌ప్‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడుగా పేరు తెచ్చుకున్న చియాన్ విక్ర‌మ్, హ‌రి ద‌ర్శక‌త్వంలో వచ్చిన సామి ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ చిత్రానికి సీక్వెల్ 'సామి2' రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకుంది. సామి చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న త్రిష‌ను హీరోయిన్‌గా తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

కాగా లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం త్రిష‌తో పాటు కీర్తి సురేష్‌ను కూడా హీరోయిన్‌గా సెల‌క్ట్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని కీర్తి సురేష్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది. ప‌వ‌ర్‌పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌ను డిజైన్ చేయ‌డం డైరెక్ట‌ర్ హ‌రిది ప్ర‌త్యేక‌మైన శైళి. మ‌రిప్పుడు సామి సీక్వెల్‌లో విక్ర‌మ్ క్యారెక్ట‌ర్‌ను ఎలా డిజైన్ చేసుంటాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

ఆ దేశంలోనే బాహుబలి-2 ఇండస్ట్రీ హిట్

బాహుబలి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్స్ సాధిస్తున్న చిత్రంగా దూసుకెళుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే ఇండియాలోనే కాదు, నేపాల్లో కూడా బాహుబలి-2 సెన్సేషనల్ వసూళ్ళను సాధిస్తూ ముందుకెళుతుంది.

బావా బాహుబలి పెళ్ళి చేసుకో అంటూ మోహన్ బాబు ట్వీట్....

విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ ఎం.మోహన్బాబు, బాహుబలి సక్సెస్ పట్ల టీంకు అభినందనలు తెలియజేశాడు.

'ఖయ్యుంభాయ్' గుమ్మడికాయ వేడుక !

గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యుం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జూన్ లో వీడెవడు?

సచిన్ హీరోగా భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా ఫేమ్తాతినేని సత్య దర్శకత్వంలో వై కింగ్ మీడియా అండ్ఎంటర్ టైన్మెంట్ సంస్థపై రైనా జోషి నిర్మించిన యాక్షన్థ్రిల్లర్ ‘వీడెవడు’.

మైత్రీ మూవీస్ లో చైతు...

ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై రారండోయ్ వేడుకచూద్దాం, కృష్ణ అనే నూతన దర్శకుడితో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న అక్కినేని నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు వినపడ్డ సంగతి తెలిసిందే.