close
Choose your channels

ఎగ్జ‌యిట్ అవుతున్న కీర్తిసురేష్‌..!

Tuesday, February 16, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎగ్జ‌యిట్ అవుతున్న కీర్తిసురేష్‌..!

మ‌హాన‌టితో జాతీయ అవార్డును ద‌క్కించుకున్న హీరోయిన్ కీర్తిసురేష్.. చాలా ఎగ్జ‌యిట్ అవుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా చెప్పింది. ఇంత‌కీ కీర్తి సురేష్ ఎందుకు ఎగ్జ‌యిట్ అవుతుందో తెలుసా..! దుబాయ్ వెళుతున్నందుకు. దుబాయ్ వెళితేనే ఎగ్జ‌యిట్ అయిపోవాలా? అనే సందేహం రాక మాన‌దు. అసలు మేట‌ర్ ఏంటంటే.. కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ స‌ర్కారువారి పాట‌. ఈ సినిమా దుబాయ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ అవుతుంది. ఈ షెడ్యూల్‌లో పాల్గొన‌డానికి కీర్తి సురేష్ వెళుతుంది. కీల‌క స‌న్నివేశాల‌తో పాటు సాంగ్స్‌ను కూడా దుబాయ్‌లో చిత్రీక‌రిస్తారు.

మ‌హేశ్ వంటి సూప‌ర్‌స్టార్‌తో క‌లిసి న‌టించ‌డంపై కీర్తిసురేష్ చాలా ఎగ్జ‌యిట్ అవుతున్న‌ట్లు చెప్పిన కీర్తిసురేష్ ఎయిర్‌పోర్ట్‌లోని ఫొటోను షేర్ చేసి స‌ర్కారువారి పాట సెకండ్ షెడ్యూల్లో జాయిన్ అవుతుండ‌టంపై ఎగ్జ‌యిటింగ్‌గా ఉంద‌ని చెప్పిడ‌మే అస‌లు సంగ‌తి. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సినిమా రూపొందుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.