నాలుగు డిఫరెంట్ లుక్స్ లో కీర్తి

  • IndiaGlitz, [Monday,October 21 2019]

సాధార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంతో మంది న‌టీన‌టులు వ‌చ్చి పోతుంటారు. కానీ కొంద‌రు త‌మదైన న‌ట‌న‌తో చెర‌గ‌ని ముద్ర వేస్తుంటారు. అలాంటి వారిలో కీర్తి సురేశ్ ఒక‌రు. అందుకే వ‌చ్చిన అతి కొద్ది స‌మ‌యంలో న‌టిగా గుర్తింపు సంపాదించుకోవ‌డ‌మే కాదు.. 'మ‌హాన‌టి'తో ఉత్త‌మ‌న‌టిగా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అవార్డు గుర్తింపు తేవ‌డంతో పాటు బాధ్య‌త‌ను కూడా మ‌రింత పెంచింద‌ని కీర్తిసురేష్ భావించిందేమో! క‌థ‌ల ఎంపిక‌లో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తుంది కీర్తి సురేష్‌. ఇప్పుడు ఆమె చేతిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే బాలీవుడ్ సినిమాల‌తోనూ కీర్తి ఫుల్ బిజీగా మారిపోయింది.

తాజాగా ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో 'మిస్ ఇండియా' ఒక‌టి. ఈ సినిమా కోసం కీర్తి ప‌డ్డ క‌ష్టం చూస్తే ఎవ‌రైనా షాక్ కావాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకు ముందు చ‌బ్బీగా ఉండే కీర్తిసురేష్ బ‌రువు బాగా త‌గ్గిపోయింది. ఎంత‌లా అంటే.. చిన్న‌పిల్ల‌లా క‌నిపించేంతలా. ఈ సినిమాలో నాలుగు డిఫ‌రెంట్ లుక్స్ ఉన్నాయ‌ట‌. ఏదో మేక‌ప్ వేసుకుని న‌టించాల‌ని కాకుండా.. పాత్ర కోసం ప్యాష‌న్‌గా  వ‌ర్క్ చేస్తుంద‌ట‌. ఈ నాలుగు లుక్స్ కోసం కీర్తి సురేష్ దాదాపు 50 లుక్ టెస్ట్‌లు చేసింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. న‌రేంద్ర నాథ్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నారు.

More News

అక్టోబర్ 25న 'ప్లానింగ్' గ్రాండ్ రిలీజ్

మ‌హేంద్ర‌- మ‌మ‌త కుల‌క‌ర్ణి  హీరోహీరోయిన్లు గా బి.ఎల్.ప్ర‌సాద్  ద‌ర్శ‌క‌త్వంలో సాయి గ‌ణేష్ మూవీస్ ప‌తాకంపై టి.వి.రంగ‌సాయి నిర్మించిన చిత్రం `ప్లానింగ్`.

'అమృతరామమ్‌' ఫస్ట్ లుక్ రిలీజ్

రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్‌ జంటగా  సురేందర్ కొంటాడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా "అమృత రామమ్".

బన్నీ కొత్త లుక్ కోసం స్పెషల్ డైట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోని తన పాత్ర కోసం సరికొత్త డైట్‌ను ఫాలో అయ్యాడ‌ట‌. అస‌లు ఇంత‌కు బ‌న్నీ డైట్‌ను ఎందుకు ఫాలో అయ్యాడు?

'తుపాకీ రాముడు' ఓ సందేశాత్మ‌క చిత్రం: తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు

బిత్తిరి స‌త్తి, ప్రియ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం `తుపాకీ రాముడు`. ర‌స‌మ‌యి ఫిలింస్ ప‌తాకంపై టి.ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో

ఏపీలో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జి మంత్రులు వీరే...

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.