మ‌హేశ్ 27లో మ‌హాన‌టి..?

  • IndiaGlitz, [Thursday,March 26 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి స్థానంలో ప‌రుశురామ్ చేరాడు. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. కాబ‌ట్టి ప‌రుశురామ్‌కు కావాల్సినంత టైమ్ దొరికింది. స్క్రిప్ట్‌ను మరింతగా మెరుగులు దిద్దే ప‌నిలో ప‌డ్డాడీ ద‌ర్శ‌కుడు. సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసి జూలైలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ను న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గి.. లాక్ డౌన్ ఎత్తి వేయ‌గానే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అవుతాయ‌ట‌.

అలాగే ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ‌ర్మ్‌లో ఏప్రిల్ 28న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని టాక్‌. ఇదే రోజున 14 ఏళ్ల క్రితం అంటే 2006లో మ‌హేశ్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచి, మ‌హేశ్‌ని సూప‌ర్‌స్టార్‌గా నిల‌బెట్టిన పోకిరి చిత్రం విడుద‌లైంది. అదే రోజున త‌న 27వ సినిమాను మ‌హేశ్ విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భాస్, మహేష్ బాబు విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో.. టాలీవుడ్ నటీనటులు పలు జాగ్రత్తలు, సలహాలు, సూచనలిస్తూ చైతన్య పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత పెద్ద మనసు

చిరు, మోహ‌న్‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ‌

మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు కెరీర్ ప్రారంభంలో ఇద్ద‌రూ క‌లిసి సినిమాలో న‌టించారు. నాయ‌కుడు, ప్ర‌తినాయ‌కుడు పాత్ర‌ల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు.

సినీ కార్మికులకు చిరంజీవి భారీ విరాళం

కరోనా నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ అవ్వడంతో టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు మొదలుకుని రిలీజ్‌లు కూడా ఆగిపోయాయి. దీంతో సినీ కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

చెర్రీని అభినందించిన పవన్ కల్యాణ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విరాళం ప్రకటించారు.

కొంతమంది ‘సినిమా’కు అవసరం : హరీష్

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్న తరుణంలో.. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ఆపన్నహస్తంగా పలువురు ప్రముఖులు ఆర్థికంగా సాయం చేస్తున్నారు.