close
Choose your channels

బాలీవుడ్ ప్రాజెక్ట్ నుండి కీర్తి సురేష్ ఔట్‌!!

Friday, January 17, 2020 • తెలుగు Comments

బాలీవుడ్ ప్రాజెక్ట్ నుండి కీర్తి సురేష్ ఔట్‌!!

మ‌హానటితో ద‌క్షిణాదిలో హీరోయిన్ త‌నేంటో ప్రూవ్ చేసుకున్న కీర్తిసురేష్‌.. ఇప్పుడు హిందీలోకి `మైదాన్‌` సినిమాతో ఎంట్రీ ఇస్తున్నానని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. `బ‌దాయి హో` ద‌ర్శ‌కుడు అమిత్ శ‌ర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌గా, బోనీ క‌పూర్ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు. కొంత మేర చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. అయితే ఈ సినిమాలో అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌స‌న కీర్తిసురేష్ స‌రిపోలేద‌ట‌. చూడ‌టానికి చిన్న‌పిల్లలాగా అనిపించింద‌ట‌. దాంతో కీర్తిసురేష్‌, నిర్మాత బోనీ క‌పూర్ మ‌ధ్య సినిమా పరంగా కొన్ని చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. చివ‌ర‌కు కీర్తి తాను సినిమా నుండి డ్రాప్ అవుతున్నాని నిర్మాత‌కు చెప్పేసింద‌ట‌. అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.

 1950-63 కాలంలో ఇండియ‌న్ ఫుట్‌బాల్ కు క్రేజ్ తెచ్చిన ఆట‌గాడు స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో స‌య్యద్ అబ్దుల్ ర‌హీమ్ పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తుండ‌గా ఆయ‌న భార్య‌గా, విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో కీర్తిసురేష్ న‌టించ‌డానికి ఒప్పుకున్నారు. కానీ చివ‌ర‌కు కీర్తి సినిమా నుండి త‌ప్పుకుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

 
 

Get Breaking News Alerts From IndiaGlitz