బాలీవుడ్ ప్రాజెక్ట్ నుండి కీర్తి సురేష్ ఔట్‌!!

  • IndiaGlitz, [Friday,January 17 2020]

మ‌హానటితో ద‌క్షిణాదిలో హీరోయిన్ త‌నేంటో ప్రూవ్ చేసుకున్న కీర్తిసురేష్‌.. ఇప్పుడు హిందీలోకి 'మైదాన్‌' సినిమాతో ఎంట్రీ ఇస్తున్నానని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'బ‌దాయి హో' ద‌ర్శ‌కుడు అమిత్ శ‌ర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌గా, బోనీ క‌పూర్ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు. కొంత మేర చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. అయితే ఈ సినిమాలో అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌స‌న కీర్తిసురేష్ స‌రిపోలేద‌ట‌. చూడ‌టానికి చిన్న‌పిల్లలాగా అనిపించింద‌ట‌. దాంతో కీర్తిసురేష్‌, నిర్మాత బోనీ క‌పూర్ మ‌ధ్య సినిమా పరంగా కొన్ని చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. చివ‌ర‌కు కీర్తి తాను సినిమా నుండి డ్రాప్ అవుతున్నాని నిర్మాత‌కు చెప్పేసింద‌ట‌. అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.

1950-63 కాలంలో ఇండియ‌న్ ఫుట్‌బాల్ కు క్రేజ్ తెచ్చిన ఆట‌గాడు స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో స‌య్యద్ అబ్దుల్ ర‌హీమ్ పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తుండ‌గా ఆయ‌న భార్య‌గా, విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో కీర్తిసురేష్ న‌టించ‌డానికి ఒప్పుకున్నారు. కానీ చివ‌ర‌కు కీర్తి సినిమా నుండి త‌ప్పుకుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

 
 

More News

షూటింగ్ షురూ చేసిన ప్ర‌భాస్

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌ర్వాత వ‌చ్చిన సాహోతో ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని మాత్రం అందుకోలేక‌పోయాడు.

ఎల్ వి ప్రసాద్ ధైర్యం చెప్పక పోయివుంటే నేను నటుడిగా నిలపడేవాణ్ణి కాదు - కృష్ణం రాజు

భారత చలనచిత్ర పితామహుడు, మూకీ యుగం నుండి డిజిటల్ మూవీస్ వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్బిటర్ గా, ఫిలిం ల్యాబ్ అధినేతగా భారత సినీ పరిశ్రమ మార్గదర్శకుడు ఎల్.ప్రసాద్,

'అల... వైకుంఠపురంలో' విజయోత్సవ వేడుక వివరాలు

'అల... వైకుంఠపురంలో' చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు చేసుకుంది..

ఎంజీఆర్ లుక్ లో ఒదిగిపోయిన అరవింద్ స్వామి

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న‌ చిత్రం `త‌లైవి`. బాలీవుడ్‌క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

పూజా హెగ్డే.. భలే ఛాన్స్ కొట్టేసింది!

కన్నడ కస్తూరి పూజా హెగ్డేకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వరుసపెట్టి అగ్రహీరోలతో సినిమాలు చేస్తున్న పూజా.. తాజాగా మరోస్టార్ హీరోతో జతకట్టడానికి రెడీ అవుతోందట. ఇంతకూ ఆయనెవరు అనుకుంటున్నారా..