నిర్మాత‌గా మారుతున్న కీర్తి..?

  • IndiaGlitz, [Monday,August 31 2020]

కీర్తి సురేశ్‌... ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని ఒక ప‌క్క స్టార్ హీరోల సినిమాల‌తో పాటు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాల‌ను ఒప్పుకుంటూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. మ‌హాన‌టితో జాతీయ అవార్డును సంపాదించుకుని ఓ మెట్టు పైకి ఎక్కిన కీర్తి వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతూ స్పీడుమీదున్నారు. అయితే లేటెస్ట్ ట్రెండ్‌ను కీర్తి ప‌క్కాగా ఫాలో అవుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. ఎందుకంటే.. త్వ‌ర‌లోనే కీర్తిసురేశ్ నిర్మాత‌గా అవ‌తారం ఎత్త‌నున్నారనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌కే ప‌రిమిత‌మైన కీర్తిసురేశ్ త్వ‌ర‌లోనే డిజిట‌ల్ మాధ్య‌మంలోకి అడుగుపెడుతున్నారు. అయితే న‌టిగా మాత్రం కాదండోయ్‌. నిర్మాత‌గా అని టాక్ వినిపిస్తోంది. కీర్తిసురేశ్ ప్రొడ‌క్ష‌న్‌లో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు నటిగా కీర్తి కిట్టీలో ‘గుడ్ ల‌క్ స‌ఖితో పాటు మిస్ ఇండియా విడుదల కావాల్సి ఉండగా నితిన్‌తో రంగ్ దే, స‌ర్కారువారి పాట‌’, ఓ మ‌ల‌యాళం చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. పెంగ్విన్ త‌ర్వాత విడుదల కానున్న మిస్ ఇండియా, గుడ్ ల‌క్ స‌ఖి చిత్రాలు ఓటీటీ బాట‌ప‌ట్ట‌నున్నాయి.

More News

పవన్ అభిమానులకు ట్రీట్ ప‌క్కా!!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2. ప‌వ‌న్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఇప్ప‌టికే రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు.

‘వైల్డ్ డాగ్‌’ను షురూ చేసిన నాగార్జున‌

నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’ షూటింగ్ షురూ అయ్యింది. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో

‘వి’ అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - ఇంద్ర‌గంటి

2004లో ద‌ర్శ‌కుడిగా ‘గ్ర‌హ‌ణం’ సినిమాతో కెరీర్‌ను ప్రారభించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

1 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘రెచ్చిపోదాం బ్రదర్’ లిరికల్ సాంగ్

ప్రచోదయ ఫిల్మ్స్ పతాకం‌పై కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రదారులుగా ఏ. కె. జంపన్న దర్శకత్వంలో..

ఈ సినిమా థియేటర్‌లో చూస్తే చాలా బాగుంటుందన్నారు: ‘వి’ డైరెక్టర్

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘వి’.