చైనీస్ న‌టుడితో కీర్తి

  • IndiaGlitz, [Thursday,October 04 2018]

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం.. 16వ శతాబ్దానికి చెందిన కుంజలి మరక్కర్ IVగా పేరుగాంచిన మహమ్మద్ అలీ జీవిత కథగా తెరకెక్కుతోంది. 'మరక్కర్: ది లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' అనే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, పరేష్ రావ‌ల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు.

16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారిపై కుంజలి మరక్కర్ సైన్యం.. నీటి మీద సాగే యుద్ధ నౌకలతో తిరుగుబాటు చేసేవారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాలోని ఆ సన్నివేశాలను కళ్ళకి కట్టినట్టు చూపించనున్నారు ద‌ర్శ‌కులు. అందుకోసం.. పోర్చుగీస్ వారి పాత్రల్లో కొంతమంది బ్రిటిష్ నటుల‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

టాలీవుడ్ నుండి నాగార్జున ఈ చిత్రంలో న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కూడా న‌టించ‌నుంద‌ట‌. అది కూడా ఓ చైనీస్ న‌టుడు స‌ర‌స‌న‌. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ట‌. నవంబ‌ర్‌లో ఈ సినిమా రామోజీ ఫిలింసిటీలో ప్రారంభం అవుతుంద‌ట‌.

More News

 హైద‌రాబాద్‌లో కె.జె.ఏసుదాస్ లైవ్ క‌న‌సర్ట్

ఐదు ద‌శాబ్దాలుగా ఎన్నో ఉత్త‌రాది, ద‌క్షిణాది చిత్రాల్లో త‌న మ‌ధుర గాత్రంతో ప్రేక్ష‌కుల్ని సంగీత స్వ‌ర‌ సాగ‌రంలో ఓల‌లాడించిన గాన కోవిదుడు కె.జె.ఏసుదాస్‌.

సుడిగాలి పాటలు విడుదల

వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత హీరో హీరోయిన్లు గా రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్స్ పతాకం

త‌నుశ్రీ వివాదం పై శ‌క్తి క‌పూర్ వ్యంగ్యం

2008లో జ‌రిగిన ఓ డాన్స్ సీక్వెన్స్‌లో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఇటీవ‌ల బాలీవుడ్ తార త‌ను శ్రీ ద‌త్తా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

ద‌క్షిణాది సినిమాల‌ పై జాన్వీ షాకింగ్ కామెంట్స్‌

అల‌నాటి అందాల తార.. అభిన‌య తార శ్రీదేవి కుమార్తె.. జాన్వీ క‌పూర్ 'ద‌ఢ‌క్' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

రౌడీల‌కు విజ‌య్‌దేవ‌ర‌కొండ లేఖ‌..

యూత్‌కు మంచి క్రేజ్ ఉన్న హీరోగా విజ‌య్‌దేవ‌ర‌కొండ ఇమేజ్ ఉంది. అందుకే త‌న‌ను రౌడీ అని.. త‌న అభిమానుల‌ను రౌడీస్ అని విజ‌య్ సంబోధిస్తుంటాడు.