close
Choose your channels

మేక‌ప్ లేకుండా కీర్తిసురేశ్‌.. థాంక్స్ చెప్పింది

Friday, May 22, 2020 • తెలుగు Comments

మేక‌ప్ లేకుండా కీర్తిసురేశ్‌.. థాంక్స్ చెప్పింది

లేటెస్ట్‌గా కీర్తి సురేశ్ పోస్ట్ చేసిన వీడియో ఒక‌టి నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కూ కీర్తి సురేశ్ పోస్ట్ చేసిన వీడియో ఏంటో తెలుసా? ఇటీవ‌ల కీర్తిసురేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ను రీచ్ అయ్యింది. ఈ సంద్భంగా త‌న ఫాలోవర్స్‌కు, అభిమానుల‌కు వీడియో ద్వారా కీర్తి సురేశ్ థాంక్స్ చెప్పింది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యేమంటే ఈ వీడియోలో కీర్తిసురేశ్ ఎలాంటి మేక‌ప్ లేకుండా ఉండ‌ట‌మే. త‌న‌కు ఇంత ప్రేమాభిమానాలు పంచుతున్నందుకు త‌న‌తో పాటు త‌న కుక్క నిక్ కూడా సంతోషంగా ఉంద‌ని కీర్తి తెలిపారు.

మ‌ల‌యాళ చిత్రాల్లో నటించి ఆ త‌ర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తిసురేశ్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను శైల‌జ చిత్రంతో ప‌రిచ‌యమైంది. త‌ర్వాత తెలుగు, త‌మిళ చిత్రాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తూ సినిమాలు చేస్తూ వ‌స్తుంది. అల‌నాటి అగ్ర క‌థానాయిక సావిత్రి బ‌యోపిక్ మ‌హాన‌టిలో నటించి ఏకంగా జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డును సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం నితిన్‌తో రంగ్ దే, సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌తో అణ్ణాత్త చిత్రాల్లోనూ న‌టిస్తుంది. ఈమె న‌టించిన పెంగ్విన్ చిత్రం డిజిట‌ల్ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌సారం కానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz