లక్ అనేది - లేదు... మన రాత - మనమే రాసుకోవాలి : స్పూర్తి నింపేలా 'గుడ్ లక్ సఖి'

  • IndiaGlitz, [Monday,January 24 2022]

నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు కీర్తిసురేష్.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు… నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సావిత్రి బయోపిక్ మహనటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడమే కాకుండా… తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఒక్కసారిగా కీర్తి సురేశ్ కెరీర్ మారిపోయింది. దక్షిణాదిలో కీర్తి సురేష్‏కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె సౌత్‌లోని టాప్ హీరోయిన్లలలో ఒకరిగా వెలుగొందుతున్నారు.

తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్ లక్ సఖి'. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తుండగా... జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. 'దిల్' రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌) సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్రావ్యా వర్మ సహ నిర్మాత. ఈ క్రమంలో గుడ్ లక్ సఖి ట్రైల‌ర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. దేశం గర్వపడేలా షూటర్స్‌ను తయారు చేయాలని భావించిన ఓ కోచ్‌కు అమ్మాయి సఖిని (కీర్తి సురేశ్) ఓ కుర్రాడు పరిచయం చేస్తాడు. గ్రామస్తులంతా ఆ అమ్మాయిని అందరూ 'బ్యాడ్ లక్ సఖి' అంటారు. రైఫిల్ షూటింగ్‌లో ఏమాత్రం అనుభవం లేని ఆ అమ్మాయి కోచ్ దగ్గరకు వెళ్లినప్పుడు లక్ష్యం మీద కాలుస్తుంది. శిక్షణ తీసుకుని పోటీలకు వెళ్లినప్పుడు మాత్రం ఆమె టార్గెట్ మిస్ అవుతుంది. దీంతో నిరాశలో కూరుకుపోయిన సఖి.. మళ్లీ విజేతగా ఎలా నిలిచింది? అనేది మిగిలిన కథగా తెలుస్తోంది. ఈ నెల 28న థియేటర్లలో 'గుడ్ లక్ సఖి' విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.

More News

ప్రముఖ జ్యోతిష్యులు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూత

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూశారు.

'అనుపమ చాలా డేంజ‌ర‌స్ హౌజ్ వైఫ్ రా '.. సస్పెన్స్ పెంచేస్తోన్న భామా క‌లాపం టీజర్‌

2003లో ఎవరే అతగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రియమణి. తర్వాత 'పెళ్లైన కొత్తలో' , 'యమదొంగ', రగడ, గోలిమార్ తదితర సినిమాలతో

లైగర్‌లో సమంత ఐటెం సాంగ్.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్,  నిజమెంత..?

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతా దూసుకెళ్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఇష్యూతో ఆమె మరింత పాపులర్ అయ్యారు.

పెళ్లి సందడి బ్యూటీకి ఆఫర్ల వెల్లువ.. చేతిలో నాలుగు సినిమాలు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మలకు తర్వాత వరుసపెట్టి అవకాశాలు వస్తుంటాయి.

ఆసుపత్రిలో లతా మంగేష్కర్.. ఆటో డ్రైవర్ త్యాగం, ఏం చేశాడంటే..?

దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్(92) కరోనా బారినపడటంతో ఆమె ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.