పెళ్లి చేసుకోనున్న 23 ఏళ్ల మేయ‌ర్, 28 ఏళ్ల ఎమ్మెల్యే, ముహూర్తం ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Wednesday,February 16 2022]

ప్రస్తుత పరిస్ధితుల్లో రాజకీయాలకు యువత దూరమవుతున్న సంగతి తెలిసిందే. అయితే డాక్టర్, లేదంటే ఇంజనీరింగ్ చదివి జీవితంలో స్థిరపడాలని చూస్తున్నారు. ఇవి కాకుండా ఏదో ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పోటీ పరీక్షలు రాస్తున్నారు తప్పించి.. ఎవరూ రాజకీయాలవైపు తొంగి చూడటం లేదు. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం .. యువత ఉత్సాహంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులుగా గెలుస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

తాజాగా దేశంలోనే అత్యంత చిన్న వ‌య‌స్కురాలైన మేయ‌ర్ ఆర్య రాజేంద‌ర్, యంగ్ ఎమ్మెల్యే స‌చిన్ దేవ్ ఇద్దరూ పెళ్లి బంధం ద్వారా ఒక్కటవుతూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. కేరళ రాజధాని తిరువ‌నంత‌పురం మేయ‌ర్ గా ఆర్య‌, బ‌లుస్సేరి ఎమ్మెల్యేగా స‌చిన్ దేవ్ ఉన్నారు. ఆర్య వ‌య‌సు 23, కాగా స‌చిన్ వ‌య‌సు 28. వీరి పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదిరింది, అయితే వివాహ తేదీ ఎప్పుడనేది మాత్రం తెలియరాలేదు. ఆర్య, సచిన్‌లు చిన్ననాటి స్నేహితులు, అంతేకాదు ఎస్‌ఎఫ్‌ఐలో కలిసి పనిచేశారు కూడా.

23 ఏళ్ల ఆర్య రాజేంద్రన్ మనదేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా రికార్డుల్లోకెక్కారు. ఆమె తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి కార్పోరేటర్‌గా గెలిచారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు ఆమెను మేయర్‌గా ఎన్నుకున్నారు. ఆ సమయంలో ఆర్య వయసు (21) సంవత్సరాలే. ఇక సచిన్ విషయానికి వస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అది అలాంటి ఇలాంటి విజయం కాదు.. ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి సచిన్ గెలిచారు. దీంతో కేరళలో అతిచిన్న వయస్సులో ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు

More News

'వర్జిన్ స్టోరి' నిజమైన ప్రేమకు పరీక్ష పెడుతుంది - నిర్మాత లగడపాటి శ్రీధర్

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై స్టైల్, స్నేహగీతం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లాంటి హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత లగడపాటి శ్రీధర్.

అజిత్ ధోవల్ ఇంట్లోకి కారుతో చొచ్చుకెళ్లిన ఆగంతకుడు.. నా బాడీలో చిప్, పోలీసుల అదుపులో నిందితుడు

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ ధోవల్ నివాసం వద్ద బుధవారం ఓ ఆగంతకుడు హల్‌చల్‌ చేయడంతో భద్రతా దళాలు ఉలిక్కిపడ్డాయి.

నెలరోజులుగా ఆసుపత్రిలోనే బప్పిలహరి, మంగళవారం డిశ్చార్జ్... అంతలోనే

80, 90 దశకాల్లో దేశాన్ని ఉర్రూతలూగించిన బప్పిలహిరి మరణంతో యావత్ దేశం విషాదంలో కూరుకుపోయింది.

భారతీయ సంగీత ప్రపంచంలో విషాదం.. దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహిరి కన్నుమూత

ఇప్పటికే లతా మంగేష్కర్, నిన్న రాత్రి హీరో దీప్ సిద్ధూ మరణాల నుంచి కోలుకోకముందే భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

‘నో కామా-నో ఫుల్ స్టాప్-నాన్ స్టాప్‌గా’ ఓటీటీ వేదికగా బిగ్‌బాస్ , ఆకట్టుకుంటోన్న ప్రోమో

భారతదేశంలో బిగ్‌బాస్ షోకి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ రియాలిటీ షో..