'కేశవ' సెన్సార్ పూర్తి.... 19 న రిలీజ్

  • IndiaGlitz, [Monday,May 15 2017]

ఎక్కడికి పోతావు చిన్నవాడా', సూర్య వర్సెస్‌ సూర్య', కార్తికేయ'... మూడేళ్లుగా నిఖిల్‌ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వ‌ట‌మే కాకుండా నిఖిల్ చిత్రం అంటే వైవిధ్యం తో కూడిన చిత్రాల కేరాఫ్ అడ్రాస్ గా క్రేజ్ సాంధించాడు నిఖిల్‌ సూపర్‌హిట్‌ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్‌ పునాది వేసిన దర్శకుడు సుధీర్‌వర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రొక్క‌సారి డిఫిరెంట్ పాయింట్ తో మే 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న చిత్రం కేశ‌వ‌. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసిన శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా నిర్మాత. ఇందులో పెళ్లి చూపులు' ఫేమ్‌ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించి కాళ‌భైర‌వ సాంగ్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం క్రియెట్ చేయ‌గా, రెండ‌వ సాంగ్ ని హీరో నిఖిల్ యుస్ లో శ్రీ సాయిద‌త్తా పీఠం లో సుమారు వెయ్య‌మంది తెలుగు సినిమా అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశాడు. మే 19న సమ్మర్ కానుకగా కేశవ ప్రేక్షకులు ముందుకు రానుంది.

More News

'భవంతి 108'

నలుగురు జంటలు అడవిలో దారితప్పి ఓ ఆసుపత్రికి వెళ్ళిన నేపథ్యంలో సాగే కథతో 'భవంతి 108' చిత్రం రూపొందింది.

వరంగల్ లో ఎస్ పి ఐ సినిమాస్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ గ్రాండ్ లాంచ్

చైన్నైలో పేరు గాంచిన ఎస్ పి ఐ సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించింది. తెలంగాణ రాష్ట్రంలో

డాన్సర్ పాత్రలో ఎన్టీఆర్

జనతా గ్యారేజ్ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో

వెంకీ ప్లేస్ లో పవన్ కళ్యాణ్

బాలీవుడ్ సినిమా 'జాలీ ఎల్ఎల్ బి2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారని అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని

స్టార్ హీరో డ్రైవర్ పై కేసు..

స్టార్ హీరో అల్లుఅర్జున్ కారు డ్రైవర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే..అల్లుఅర్జున్ , శనివారం జూబ్లీహిల్స్లోని మొకాబాక్కు వెళ్ళారు.