close
Choose your channels

ఆర్టీసీ.. ఆ ఒక్కటీ వద్దు.. కేసీఆర్ నిర్ణయం సరైనదే!

Monday, October 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్టీసీ.. ఆ ఒక్కటీ వద్దు.. కేసీఆర్ నిర్ణయం సరైనదే!

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడం.. ఇప్పటికే ఇద్దరూ కార్మికులు బలిదానాలు కావడంతో రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉధృతస్థాయికి చేరాయి. అసలు ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ఏం చేయబోతున్నారో..? అనేది ఇప్పటికే ప్రణాళికలు సైతం రచిస్తున్నారు. మరోవైపు తెలంగాణ కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మొండికేసి కూర్చున్నారు. అయితే అప్పుడప్పుడు మంత్రులు, గులాబీ పార్టీకి చెందిన ముఖ్యనేతలు మాత్రం మీడియా ముందుకొచ్చి.. ఆర్టీసీని ప్రైవేట్ చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అయితే తాజాగా.. టీఆర్‌ఎస్‌ ఎంపీ, పార్లమెంటరీ నేత కేశవరావు (కేకే) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విలీనం చేస్తామని చెప్పలే!

‘ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు నన్ను బాధించాయి. ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపజాలదు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలి. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించింది. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే మా విధానాన్ని మార్చుకోవాలని కోరడమే.. ఈ ఒక్కటి తప్ప ఆర్టీసీ కార్మికులు ఏమడిగినా చేయడానికి సర్కార్ సిద్ధంగా ఉంది. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయం’ అని కేకే చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా!

ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చి చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నానని.. ఇందుకు ఆయనను అభినందిసస్తున్నాని ఆయన పేర్కొన్నారు. ఇక అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజీ క్యారేజీల విషయంలో కేసీఆర్‌ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని విఙ్ఞప్తి చేశారు. అంతటితో ఆగని ఆయన.. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తేల్చిచెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలు చేయవద్దని సూచించారు. సమస్యకు ఆత్మహత్యలు, బలిదానాలు పరిష్కారం కాదని హితవు పలికిన కేకే, సమ్మె విరమిస్తే, చర్చలకు ప్రభుత్వం సిద్ధమన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.