విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

  • IndiaGlitz, [Thursday,July 16 2020]

విజయవాడ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులతో ఉన్న పాత పరిచయాల ఆధారంగా డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా.. విజయవాడలో డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు విదేశీయులు పోలీసులకు అడ్డంగా దొరికి పోవడం ఇది రెండో సారి కావడం గమనార్హం. గతంలో ద్వారకా తిరుమల రావు సీపీగా ఉన్నప్పుడు ఇద్దరు విదేశీయులు ఇలాగే పట్టుబడ్డారు. కాగా.. విజయవాడలో డ్రగ్స్ అమ్మకంలో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్న కోనేరు అర్జున్.. పెనమలూరు పీఎస్ పరిధిలో ఒక కళాశాల లో బీటెక్ చేసినట్టు గుర్తించారు.

పాత పరిచయాలతో పాటు ఇతర కళాశాలల్లోని స్నేహితుల ఆధారంగా ఈ డ్రగ్స్ అమ్మకాలను కొనసాగిస్తున్నట్టు గుర్తించారు. సూడాన్‌ దేశానికి చెందిన మహమ్మద్‌ గహేల్‌ రసూల్‌(25) అలియాస్‌ కబూబ్‌, టాంజానియా దేశానికి చెందిన యోనా లిస్వా షబానీ(26) నుంచి అర్జున్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. అర్జున్‌తో పాటు అతని వద్ద డ్రగ్స్ కొన్నవారిని సైతం విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు. విదేశీయుల పాస్‌పోర్టులను రద్దు చేయించడానికి అధికారులతో పోలీసులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

కాగా.. డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను విజయవాడ టాస్క్‌ఫోర్సు పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి 17 గ్రాముల మెథలైన్‌ డయాక్సీ మిథాం ఫేటమిన్‌, 150 గ్రాముల గంజాయి, బిట్‌కాయిన్స్‌, హుక్కా పరికరం, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురిలో సూడాన్‌ దేశానికి చెందిన మహమ్మద్‌ గహేల్‌ రసూల్‌‌, టాంజానియా దేశానికి చెందిన యోనా లిస్వా షబానీ, కోనేరు అర్జున్ ఉన్నారు.

More News

రూ.399కే కరోనా కిట్.. 3 గంటల్లో ఫలితం..

కరోనా కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఓ వైపు కరోనా లక్షణాలతో బాధపడుతూ..

టీటీడీలో 140 మంది కరోనా.. బదిలీ కోరుతున్న అర్చకులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో 140 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బిషప్ ఫ్రాంక్‌కు కరోనా..

బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇండియాలో 10 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు

భారత్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌కు యాక్సిడెంట్.. కేర్‌కు తరలింపు

లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు చాలా వరకూ తగ్గాయి. ఇటీవల సడలింపులివ్వడంతో ప్రమాదాలు తిరిగి ప్రారంభమయ్యాయి.