కేజీఎఫ్ 2: అధీర ఎలా బతికున్నాడు?

  • IndiaGlitz, [Wednesday,January 06 2021]

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఎంత సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో... ప్రస్తుతం అధీర ఎలా బతికున్నాడు? అనే ప్రశ్న కూడా అంతే సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తోంది. ‘కేజీఎఫ్ 2’ చిత్రం శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జనవరి 8న హీరో రాకీ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా అప్పటి ‘కేజీఎఫ్ టైమ్స్’ పత్రిక పేరుతో ఓ పేపరును విడుదల చేసింది. ఆ పేపరులో ‘అధీర ఎలా బతికున్నాడు?’ అనే పేరుతో ఓ ఆర్టికల్ ప్రముఖంగా ప్రచురించబడింది. దీనిలో అధీర ఫోటోతో పాటు..దాడి చేసిన రోజు నాటి ఫోటో.. రాకీ సింహాసనాన్ని అధిష్టించిన ఫోటోను ప్రచురించారు.

రాకీ ఫోటోకి.. ‘చరిత్రకు రాజులు బానిసలు. కానీ, రాకీ చరిత్ర సృష్టించినోడు..’ అని క్యాప్షన్ పెట్టారు. ‘అధీర ఎలా బతికున్నాడు?’ను టైటిల్‌గా ఇచ్చి దాని కింద.. ‘వాడు ఓడిపోడా? వాడికి చావు లేదా? వాడి మీద దాడి ముందే తెలుసుకోగలిగాడా? దేశానికి తెలియాలి’ అనే సబ్ టైటిల్స్‌ను ఇచ్చారు. ‘కేజీఎఫ్ అధిపతి సూర్యవర్థన్ ఆరోగ్యం క్షీణించినప్పుడు తన అధికారాన్ని పెద్ద కొడుకు గరుడకి అప్పజెప్పాడు. ఈ నిర్ణయం అధీర జీర్ణించుకోలేక పోయాడు. అధీర గరుడని చంపుదామనుకుని పన్నిన పన్నాగం విఫలమైంది. గరుడకి ఈ విషయం తెలిసాక అధీరాని అంతం చేయాలనుకున్నాడు. విజయవంతంగా చేసాడు. కానీ.. అన్నీ అనుకున్నట్టే జరిగితే అధీర ఎలా తిరిగొచ్చాడు? చావుని ఎలా జయించాడు?’ అని ఇంట్రో ఇచ్చి పూర్తి కథ చాప్టర్ 2లో కొనసాగించబడుతుందని వెల్లడించారు.

‘తొందర పడితే చరిత్రని సృష్టించలేము.. అలా అని చరిత్రని ప్లాన్ చేసి.. బ్లూ ప్రింట్ తీయలేము’ అనే అందమైన వ్యాఖ్యలతో ఆర్టికల్‌ను ప్రచురించారు. నిజానికి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది బాహుబలి 2కి ముందు చాలా మంది ఊహించగలిగారు. కొందరి ఊహలు నిజమయ్యాయి. అయితే కేజీఎఫ్ 2 స్టోరీని మాత్రం ఎవరూ ఊహించలేకపోతున్నారు. అధీర ఎలా బతికున్నాడనేది అంతుపట్టని విషయం. అందుకే ఈ సినిమా ఓ రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ‘అధీర’గా సంజయ్ దత్ నటిస్తున్నారు. మొత్తానికి 8న ఉదయం 10:18 గంటలకు ‘కేజీఎఫ్ 2’ టీజర్ రాబోతోంది.

More News

‘ఆచార్య’ టెంపుల్ టౌన్‌ సెట్‌ను చూశారా?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’.

మూడేళ్లుగా దాచిన రహస్యాన్ని బయటపెట్టిన ఇస్రో శాస్త్రవేత్త..

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.

‘ఆచార్య’ సెట్‌లో ఆకట్టుకున్న సోనూసూద్.. 100 మందికి..

‘ఆచార్య’ షూటింగ్‌ సెట్‌లో ప్రముఖ నటుడు సోనూసూద్ ఆకట్టుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు..

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్..

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్‌ కూడా అరెస్ట్ అయ్యారు.

కర్ణాటక సీఎంకు రూ. 25 వేల జరిమానా..

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైకేల్ డి.కున్హా రూ.25 వేల జరిమానా విధించారు.