ఎనిమిదేళ్ల కష్టం... థియేటర్లో ఫొటోలు, వీడియోలు తీయొద్దు : ప్రేక్షకులకు కేజీఎఫ్ టీమ్ రిక్వెస్ట్

  • IndiaGlitz, [Thursday,April 14 2022]

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ప్రాంతీయ చిత్రంగా కేజీఎఫ్ నిలిచింది. యశ్, సంజయ్ దత్‌ల నటన, ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో సినిమా ఆకాశంలో నిలిచింది. తాజాగా కేజీఎఫ్‌కి కొనసాగింపుగా ‘‘కేజీఎఫ్ చాప్టర్ 2’’ను తెరకెక్కించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటించారు. బాలీవుడ్ స్టార్స్ రవీనా టాండన్, సంజయ్ దత్‌లు కీలకపాత్రలు పోషించారు.

అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇటీవలి కాలంలో పైరసీకి అడ్డుకట్ట పడటం లేదు. సినిమా విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లోకి దిగిపోతోంది. ఈ క్రమంలో కేజీఎఫ్ టీమ్.. పైరసీపై దృష్టి పెట్టింది. తమకు తాము పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రేక్షకుల సాయం కూడా తీసుకునేలా ప్రణాళికలు రచించింది. దీనిలో భాగంగా ప్రజలను ఉద్ధేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

ఎనిమిదేళ్ల పాటు రక్తం, శ్రమ, కన్నీళ్లతో కేజీఎఫ్ సిరీస్ ను తెరకెక్కించామని... కేజీఎఫ్ 2ని థియేటర్లో చూసేప్పుడు దయచేసి వీడియో తీసి వాటిని ఆన్‌లైన్‌లో పెట్టొద్దు. అందరూ ఈ సినిమాను థియేటర్లోనే చూసేలా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే.. కేజీఎఫ్ 2 హిందీలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ రోజు విడుదలైన సినిమా అడ్వాన్సు బుకింగ్స్‌తో రికార్డులు క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 38.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సాయంత్రానికి ఇది మరింత పెరిగే అవకాశం వుంది.

More News

బీస్ట్ విడుదల : విజయ్ ఫ్యాన్స్ వీరంగం .. సినిమా నచ్చలేదంటూ,  స్క్రీన్‌కు నిప్పు

తమిళ అగ్ర కథానాయకుడు , ఇళయ దళపతి విజయ్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారన్న సంగతి తెలిసిందే.

డ్యాన్సులు, ఫైట్స్‌ల్లో చిరు- చరణ్ జోరు : ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న ‘‘ఆచార్య’’ ట్రైలర్

సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. కెరీర్‌లో పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటం..

తండ్రి కలను నిజం చేసిన అలీ కూతురు.. మురిసిపోతున్న కుటుంబం, ఫ్యాన్స్ విషెస్

పిల్లలు పుట్టగానే సరిపోదు.. వాళ్లు పెరిగి ప్రయోజకులై , వారి గురించి నలుగురూ చెబితే వినాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు.

దటీజ్ రామ్ చరణ్.. మంచి మనసుకు ఈ ఘటనే నిదర్శనం , కాదంబరి కిరణ్ పోస్ట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్.

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ కొత్త చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు.