'కె.జి.య‌ఫ్' అభిమానులకు గుడ్ న్యూస్

  • IndiaGlitz, [Saturday,December 14 2019]

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రం 'కె.జి.య‌ఫ్‌' చాప్ట‌ర్ 2. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తుంది.

క‌న్న‌డ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన 'కె.జి.య‌ఫ్' రెండు భాగాలుగా రూపొందింది. 'కె.జి.య‌ఫ్' చాప్ట‌ర్ 1ను ప్యాన్ ఇండియా చిత్రంగా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీగా నిలిచింది. దీంతో 'కె.జి.య‌ఫ్' చాప్ట‌ర్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న‌ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను డిసెంబ‌ర్ 21 సాయంత్రం 5:45గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నారు. అలాగే 2020లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. చాప్ట‌ర్ 1 సాధించిన విజ‌యంతో పెరిగిన అంచ‌నాల‌కు ధీటుగా ద‌ర్శ‌క నిర్మాత‌లు 'కె.జి.య‌ఫ్' చాప్ట‌ర్ 2ను అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.

రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో య‌ష్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌నున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం.. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

More News

ఇన్‌టెన్స్ లుక్‌తో ఆక‌ట్టుకుంటున్న రానా

'బాహుబ‌లి', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు.

నాగ‌చైత‌న్య తదుప‌రి ఖ‌రారైందోచ్‌!!

ఈ శుక్ర‌వారం `వెంకీమామ` విడుద‌లైంది. తొలి రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఈ సినిమా విడుద‌లై ఒక రోజు అయ్యిందో లేదో.. చైత‌న్య త‌దుప‌రి సినిమాను ఖ‌రారు చేశారు.

‘రంగమార్తాండ’లో ప్రకాష్ రాజ్ కుమార్తెగా శివాత్మిక!

సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఓ మంచి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో కృష్ణవంశీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఏపీలో సంక్రాంతి, క్రిస్మస్ సెలవులు ఇవే.. పండుగే పండగ!

పిల్లలు, పెద్దలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరిగ్గా నెలరోజుల్లో సంక్రాంతి రానుంది. అయితే ఈ పండుగకు గాను ప్రభుత్వం ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తుందో..? ఎన్నిరోజులు సెలవులు ఇస్తుందో..?

జ‌య‌ల‌లిత బ‌యోపిక్స్‌కి తొల‌గిన అడ్డంకులు

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి, విప్ల‌వ నాయ‌కురాలు జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. అయితే వీటికి జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీపా జ‌య‌కుమార్