‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ రిలీజ్ ఫిక్స్

  • IndiaGlitz, [Friday,January 29 2021]

తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం..ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం..
ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీభాయ్‌..
‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’ తో న‌‌రాచిలో మొద‌లైన రాకీభాయ్ దండ‌యాత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ దండ‌యాత్ర‌ను కంటిన్యూ చేయ‌డానికి రాకీభాయ్ మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నాడు.. ఇంత‌కీ ఈ రాకీభాయ్ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. రాకింగ్ స్టార్ య‌ష్‌....

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా క్రేజీ డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఎక్స్‌పెక్టేష‌న్ మూవీ ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2’. యష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాశ్‌రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 150 మిలియన్ వ్యూస్‌తో 7.5 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా ఎదురుచూస్తున్నారో. ఆ అంచనాలకు ధీటుగా ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కేజీయఫ్ ఛాప్టర్ 1కు కొనసాగింపుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీయఫ్ ఛాప్టర్ 2. వరుస ప్యాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ దక్షిణాది సినిమాల రేంజ్‌ను ప్యాన్ ఇండియా రేంజ్‌కు పెంచుతున్న అగ్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీని జూలై 16న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చ‌ల‌న చిత్రం విడుద‌ల చేస్తుంది. ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

More News

ట్రెమెండస్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తోన్న మెగాస్టార్ 'ఆచార్య' టీజర్

'ఆచార్య దేవో భవ' అని మన అందరికీ తెలిసిందే.. కానీ 'ఆచార్య రక్షోభవ' అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం: కోవింద్

పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి నేడు రాష్ట్రపతి కోవింద్‌ ప్రసంగించారు.

రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురు సహా ఆరుగురి దుర్మరణం

కూతురి పెళ్లిని ఎంతో ఆనందంగా.. ఘనంగా జరిపించాలనుకున్నారు. వచ్చే నెల 10వ తారీఖున క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరిపించేందుకు ఇరువైపుల పెద్దలూ ముహూర్తం నిశ్చియించారు.

'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రంలో 'మ‌న‌సు క‌థ' పాట‌ను విడుద‌ల చేసిన అద‌న‌పు డీసీపీ మ‌ద్దిపాటి శ్రీ‌నివాస్ రావు

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర పోషించిన 'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రంలోని మూడో పాట "మ‌న‌సు క‌థ‌"ను

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రామ్ చరణ్ భార్య ఉపాసన

కరోనా వ్యాక్సిన్ కోసం కళ్లలు కాయలు కాసేలా ఎదురు చూసిన ప్రజానీకం.. తీరా వచ్చాక మాత్రం వ్యాక్సినేషన్ కేంద్రాల వైపు కూడా చూడటం లేదు.