రాజ‌కీయాల్లోకి కె.జి.ఎఫ్ హీరో...

  • IndiaGlitz, [Tuesday,March 19 2019]

ఎవ‌రి అండ‌దండ‌లు లేకుండా క‌న్న‌డ నాట సూప‌ర్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు హీరో య‌ష్‌. ఈయ‌న న‌టించిన కె.జి.ఎఫ్ చిత్రం క‌న్న‌డ మార్కెట్ రేంజ్‌ను ఎక్క‌డికో తీసుకెళ్లింది. ఈయ‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తుంటాడు.

సినిమాల‌కు, రాజ‌కీయాల‌కున్న స‌త్సంబంధాల కార‌ణంగా.. ఈ హీరో రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే డైరెక్ట్‌గా కాదు. ఇన్ డైరెక్ట్‌గా.. ఎలాగంటే సీనియ‌ర్ న‌టుడు, రాజ‌కీయ నాయకుడైన అంబ‌రీష్ ఇటీవ‌ల అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న భార్య‌, సినీ నటి సుమ‌ల‌త లోక‌స‌భ స్థానాన్ని ఆశించారు. కానీ ఆమెకు టికెట్ ద‌క్క‌లేదు.

దీంతో ఆమె స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఈమెకు పోటీగా జె.డి.ఎస్ అభ్య‌ర్థి జాగ్వార్ హీరో నిఖిల్ కుమార్ గౌడ పోటీ చేస్తున్నాడు. దీంతో సుమల‌త‌కు హీరో య‌ష్ అండ‌గా నిల‌బడ్డాడు. అలాగే రాక్‌లైన్ వెంక‌టేష్ స‌హా మ‌రికొంత మంది కూడా ఆమెకు త‌మ మ‌ద్ధ‌తుని ప్ర‌క‌టిస్తున్నారు.

More News

ఆ సినిమాయే స్ఫూర్తి...

ఈ ఏప్రిల్ 12న 'చిత్ర‌ల‌హ‌రి' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. త‌దుప‌రి మారుతి దర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌

దెబ్బకు దెబ్బ బలంగా కొడదాం.. పాలకొల్లు జనసేనదే!

విశ్వసనీయత కోల్పోయిన నాయకులు పాలకులైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సోమ‌వారం విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో

'యాత్ర' డైలాగ్‌ను ఓ రేంజ్‌లో వాడేస్తున్న జగన్!

"నేను విన్నాను.. నేను ఉన్నాను.." ఈ డైలాగ్ ఎక్కడో విన్నామని అనిపిస్తోంది కదూ.. అవును ఇది ‘యాత్ర’ మూవీలోనిదే. ఈ డైలాగ్‌‌‌‌ను వైసీపీ అధినేత

నన్ను.. చంపడానికి ప్లాన్ చేశారా?: పోసాని

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో టాలీవుడ్ నటుడు, డైరెక్టర్, రచయిత పోసాని మురళీ కృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన..

వివేకా హత్య: తప్పులో కాలేసిన లోకేశ్

టైటిల్ చూడగానే ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..?.. అసలు వివేకా హత్య కేసు గురించి ఈయనెందుకు మాట్లాడారు..? ఈ విషయంలో ఎందుకు టంగ్ స్లిప్ అయ్యారు..? అనే సందేహాలు వస్తున్నాయ్ కదూ..