close
Choose your channels

విక్ర‌మ్ స‌ర‌స‌న కె.జి.య‌ఫ్ హీరోయిన్‌

Thursday, October 17, 2019 • తెలుగు Comments

విక్ర‌మ్ స‌ర‌స‌న కె.జి.య‌ఫ్ హీరోయిన్‌

చియాన్ విక్ర‌మ్ 58వ సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. శ‌ర‌వేగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్(ఇమైకా నొడిగ‌ల్‌) ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న కె.జి.య‌ఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. కాగా.. ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం.

లుక్ పరంగానూ కొత్తగా చూపించే ప్రయత్నం చేసే నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. పాత్రలు, వాటి తీరు తెన్నులను పక్కన పెడితే విక్రమ్ హీరోగా సక్సెస్ కొట్టి చాలా కాలమే అయ్యింది. రీసెంట్‌గా విడుదలైన `మిస్టర్ కె.కె` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. జయాపజయాలకు అతీతంగా నటనలో వైవిధ్యతను చూపిస్తున్న విక్రమ్‌కు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. కాగా త‌న 58వ‌ఈ చిత్రంలో విక్రమ్ 25 గెటప్స్‌లో కనపడబోతున్నారట. ఈ లుక్స్ కోసం అమెరికన్ కంపెనీ ఒకటి వర్క్ చేస్తుందట. ఈ చిత్రం న‌వంబ‌ర్ నుండి సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని టాక్‌.

Get Breaking News Alerts From IndiaGlitz