'స‌లార్‌'లో కేజీయ‌ఫ్ స్టార్‌..!

  • IndiaGlitz, [Tuesday,March 16 2021]

ఇద్ద‌రు ప్యాన్ ఇండియా స్టార్స్ క‌లిసి సినిమా చేస్తుంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఈ సినిమా కోసమే ఎదురుచూస్తుంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. అలాంటి పాన్ ఇండియా సినిమాల్లో ‘స‌లార్’ ఒక‌టి. ఒక‌వైపు ‘బాహుబ‌లి’ స్టార్ ప్ర‌భాస్‌, మ‌రోవైపు ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1’తో సెన్సేషన్ క్రియేట్ చేసి.. ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’తో మ‌రో సెన్సేష‌న్‌కు సిద్ధమ‌వుతున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ మ‌రోవైపు..ప్ర‌స్తుతం స‌లార్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్ప‌టికే భారీ అంచ‌నాల‌తో సినిమాను రూపొందిస్తోన్న హోంబ‌లే ఫిలింస్‌.. ఇప్పుడు మ‌రో స్టార్‌ను ఈ సినిమాలో తీసుకు రావ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట‌.

వివ‌రాల మేర‌కు కేజీయ‌ఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని స‌లార్ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో న‌ర్తింప చేయాల‌ని ప్ర‌శాంత్‌నీల్ భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌భాస్ వంటి స్టార్ చేస్తున్న మూవీ కాబ‌ట్టి.. శ్రీనిధి శెట్టి ఈ సినిమాకు నో చెప్పే ఆస్కారం ఉండ‌దు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ‘సలార్’ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

More News

ప‌వ‌ర్‌స్టార్ కోసం జాన‌ప‌ద రైట‌ర్‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌తున్న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాతో పాటు సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న సాయిప‌ల్ల‌వి చెల్లెలు..!

డాక్ట‌ర్ చ‌దివి యాక్ట‌ర్‌గా మారిన వారిలో సాయిప‌ల్ల‌వి ఒక‌టి. వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి.

అఖిల్ సినిమాలో మోహన్‌లాల్‌.. హాలీవుడ్ స్ఫూర్తితో..?

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

చంద్రబాబు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఏపీ సీఐడీ అధికారులు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆస్కార్ రేసు నుంచి సూర్య ‘ఆకాశం నీ హ‌ద్దురా’ ..ఔట్‌

ఆస్కార్ బ‌రిలో దిగే సినిమాల లిస్టుల‌ను ఆస్కార్ అవార్డుల అకాడ‌మీ రేసులో సూర్య హీరోగా నటించిన ‘శూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా)’కి నిరాశే మిగిలింది. ఇటీవల 93వ ఆస్కార్ అకాడ‌మీ రేసులో పాల్గొన‌బోయే 366