యశ్ ముఖ్య అతిథిగా బెంగళూరులో 'డియ‌ర్ కామ్రేడ్' మ్యూజిక్‌ ఫెస్టివ‌ల్‌

  • IndiaGlitz, [Saturday,July 13 2019]

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'. ఈ చిత్రంతో ద‌క్షిణాదిన స‌త్తా చాట‌డానికి సిద్ధ‌మ‌య్యారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. శుక్ర‌వారం (జూలై 12న‌) బెంగ‌ళూరులో ఈ సినిమా మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించారు. దీనికి కోర‌మంగ‌ళ‌లోని సెయింట్ జాన్స్ ఆడిటోరియం వేదికైంది. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ల‌తో ఈ మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌లో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో స్టెప్పులేయ‌డ‌మే కాదు.. స్టేజ్‌పై పియానో కూడా ప్లే చేశారు. ముఖ్యంగా క్యాంటీన్ సాంగ్‌లో చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ ఈ సాంగ్‌ను  పెర్‌ఫామ్ చేశారు.

క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఎంటైర్ యూనిట్‌ను అభినందించిన య‌శ్, క‌న్న‌డ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. శ‌నివారం కేర‌ళ ముఖ్య ప‌ట్ట‌ణం కొచ్చిన్‌లోని కొల్లూర్‌.. గోకులం క‌న్వెన్ష‌న్‌లో మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇదే విధంగా ఈ నెల 18న చెన్నైలో.. 19న హైద‌రాబాద్ న‌గ‌రాల్లో 'డియ‌ర్ కామ్రేడ్‌' మ్యూజిక్ ఫెస్టివ‌ల్స్‌ను నిర్వ‌హించ‌నున్నారు.