కార్తీ 'ఖాకి' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Tuesday,September 19 2017]

రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌'. ఈ సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా నిర్మాత‌గా కార్తీ, ర‌కుల్ జంట‌గా రూపొందిన చిత్రం 'ఖాకీ'. తమిళ సినిమా ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు'ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌'... అనేది ఉపశీర్షిక. త‌మిళంలో చతురంగ వేటై్ట' ఫేమ్‌ హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి.

2005లో ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన వాస్త‌వ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు వినోద్ ఈ క‌థ‌ను సిద్ధం చేశారు. కార్తీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల‌కు అన్నీ విధాలుగా స‌న్న‌ద్ధం అవుతుంది. సినిమాను న‌వంబ‌ర్ 17న విడుద‌ల చేస్తున్నారు. అంత కంటే ముందుగా సెప్టెంబ‌ర్ 27న టీజ‌ర్‌, అక్టోబ‌ర్ 17న ట్రైల‌ర్ విడుద‌ల చేస్తున్నారు. బిబ్రాన్ సంగీతం అందించాడు.

More News

జ‌వాన్‌ని డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కేంద్రుడు

అదేంటి? జ‌వాన్ సినిమాకి బి.వి.ఎస్‌.ర‌వి క‌దా ద‌ర్శ‌కుడు. మ‌రి ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఏమిటా? అని అనుకుంటున్నారా..? మ‌రేమి లేదండి..జ‌వాన్ సెట్స్‌కి స‌ర‌దాగా వ‌చ్చిన రాఘ‌వేంద్ర‌రావు.. ఆ చిత్ర హీరోహీరోయిన్లు సాయిధ‌ర‌మ్ తేజ్‌, మెహ్రీన్‌ల‌పై ఓ షాట్ తీశాడ‌ట‌.

'శరభ' టీజర్ విడుదల

ఆకాష్ కుమార్,మిస్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా జయప్రద ప్రధాన పాత్రలో

మహాకవి కాళోజి నారాయణరావు అవార్డు ప్రదానోత్సవం

మహకవి,ప్రజాకవి,పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా

సంకాంత్రికి వస్తున్న సూర్య కొత్త చిత్రం

గజినితో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు సూర్య.

రవితేజ తో ముచ్చటగా మూడోసారి?

కలిసొచ్చిన హీరోయిన్ లకు మరో ఛాన్స్ ఇవ్వడం అనేది సినిమా పరిశ్రమలో తరుచుగా జరిగే విషయమే.