శ్రుతిపై కామెంట్స్ విసిరిన ఖుష్బూ..

  • IndiaGlitz, [Wednesday,July 19 2017]

సీనియ‌ర్ న‌టి ఖుష్బూ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా సుప‌రిచితురాలే. త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత సుంద‌ర్.సి ని విహ‌హాం చేసుకుంది. త‌మిళ రాజకీయాల్లో బిజీగా ఉంది. త‌మిళ‌నాటు ఖుష్బూ హీరోయిన్‌గా చేసిన రోజుల్లో ఆమెకు వీరాభిమానులుండేవారు. వారు ఆమెకు ఏకంగా గుడి కూడా క‌ట్టేశారు. ఇప్పుడు ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే ఖుష్బూ భ‌ర్త సుంద‌ర్‌.సి హిస్టారిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్‌తో 'సంఘ‌మిత్ర' అనే సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాలో ముందుగా శృతిహాస‌న్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. జ‌యం ర‌వి, ఆర్య‌లు ప్ర‌ధాన పాత్ర‌ధారులు. సినిమా ఫ‌స్ట్‌లుక్ అంతా కూడా రిలీజైంది.

అంతా ఓకే షూటింగ్ స్టార్ట్ కావాల‌నుకుంటున్న స‌మ‌యంలో శృతిప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుని అంద‌రికీ షాకిచ్చింది. ఇప్పుడు యూనిట్ వ‌ర్గాల సంఘ‌మిత్ర పాత్ర‌ధారిగా హ‌న్సిక‌ను తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అస‌లు సంఘ‌మిత్ర కోసం క‌త్తి యుద్ధాలు, గుర్ర‌పు స్వారీ అంతా నేర్చుకున్న శృతి సినిమా నుండి ఎందుకు త‌ప్పుకుంద‌ని అడిగితే త‌న‌కు స్క్రిప్ట్ ఇవ్వ‌లేద‌ని, స్క్రిప్ట్ సిద్ధం కాలేని సినిమాల‌కు తాను ప‌నిచేయ‌లేన‌ని చెప్పింది. ఈ వ్యాఖ్య‌ల‌పై అప్పుడెవ‌రు పెద్ద‌గా స్పందించ‌లేదు. కానీ న‌టి ఖుష్బూ న‌ర్మ గ‌ర్భంగా శ్రుతిపై కామెంట్స్ చేసింది.

సంఘ‌మిత్ర వంటి భారీ చిత్రం అన్నీ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతాయి. ఇలాంటి సినిమాలు 30 శాతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటాయి. 70 శాతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటాయి. మీ లోపాల‌ను ఇత‌రుల‌పై రుద్దే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్దు. సినీ కుటుంబం నుండి వ‌చ్చినవారు వాళ్ల వృత్తిలో ప‌రిణితిని చూస్తారు. త‌మ‌లోని లోపాల‌ను సరిదిద్దుకున్న‌ప్పుడే ఎక్కువ కాలం సినీ ఫీల్డ్‌లో ట్రావెల్ చేయ‌గ‌ల‌ర‌ని శ్రుతిని ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేసింది. మ‌రిప్పుడు శ్రుతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More News

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు..

హైదరాబాద్ లోని గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది.. గత 15 ఏళ్లుగా పిల్మ్, టివి రంగానికి చెందిన పలు విభాగాలలో శిక్షణ ఇస్తున్న ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థకు అనుబంధంగా ఉన్న మీడియా, స్కిల్ కౌన్సిల్ అధికారికంగా ఈ గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి గుర్తింపు ఇచ్చింది.

టాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధమవుతున్న శివాని రాజశేఖర్

శివాని రాజశేఖర్,ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది.

ప్రతివాళ్ళ జీవితంలో జరిగే పోరాటమే మా 'పోరాటం' నిర్మాత శ్రీనివాస్ రావు

K3 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రావు నిర్మాతగా .. మహేంద్రన్,వినోద్ ,తను శెట్టి ,ఐశ్వర్య హీరో హీరోయిన్స్ గా తెలుగు,తమిళ్ కన్నడ బాషల్లో తెరకెక్కిన చిత్రం పోరాటం.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రథావరం'

ధర్మశ్రీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై శ్రీ మురళి,రచితారామ్ జంటగా మంజునాథ్.ఎన్ నిర్మించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో 'రథావరం'

ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో యాంగ్రీ మేన్ డా.రాజశేఖర్

సమాజం లో అంతర్గతంగా జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఆరికట్టడానికి భారత ప్రభుత్వం చేత ,స్థాపించబడ్డ సంస్థ'NIA'