పవన్ సరసన కియారా.. మహేశ్‌ మూవీలో రేణు!

  • IndiaGlitz, [Monday,January 04 2021]

టైటిల్‌ చూడగానే కాస్త విచిత్రంగా ఉంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమేనట. గత నాలుగైదు రోజులుగా ప్రముఖ వెబ్‌సైట్లలో, నెట్టింట్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ‘భరత్ అనే నేను’ సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు సరసన కియారా అద్వానీ నటించిన విషయం విదితమే. ఈ సినిమా ఏ రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్టయ్యిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో మెరిసిన కియారా ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరసన నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత వరుస సినిమాలతో బిజిబీజీగా పవన్ మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్ర రీమేక్‌లో త్వరలో నటించబోతున్నాడు. దీంతో పాటు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ సినిమా రానుంది. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కియారాను పవన్ సరసన అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఈ భామ పవన్ సరసన నటిస్తారా అని అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా.. కనీసం కథ కూడా వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

ఇక రేణు దేశాయ్ విషయానికొస్తే..

పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్.. మహేశ్ బాబు సినిమాలో నటిస్తోందట. ‘సర్కారు వారి పాట’ సినిమాలో బాబుకు వదినగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికే రేణు పాత్ర కీలకం అని టాక్. మహేశ్‌కి వదిన పాత్రలో నటించాలని ప్రస్తుతం దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. కాగా.. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో కథానాయికగా నటించిన ప్రముఖ నటి రేణు దేశాయ్ సినిమాలకు దూరమై ఫ్యామిలీతో గడుపుతోంది. ఆ తర్వాత షోకు వ్యాఖ్యతగా.. జడ్జిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే మంచి అవకాశాలొస్తే తప్పకుండా తెలుగులో నటిస్తానని ఒకానొక సందర్బంగా ఆమే స్వయాన చెప్పారు. సో.. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది.. వదినమ్మ పాత్రలో నటించడానికి ఎస్ అంటారో నో చెప్పేసి మిన్నకుండిపోతారో వేచి చూడాల్సిందే.

మొత్తానికి చూస్తే.. మహేశ్ సరసన నటించిన కియారా.. పవన్ సరసన.. పవన్ మాజీ భార్య రేణు.. మహేశ్‌కు వదినమ్మగా నటించబోతోందన్న మాట. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి. ఈ కాంబోనే వర్కవుట్ అయితే అటు మెగాభిమానులు.. ఇటు సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవదులుండవేమో. ఎంతవర్కవుట్ అవుతోంది మరి.

More News

మళ్లీ బీజేపీలోకి జీవిత.. ఇంకెన్నిసార్లో!?

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు ఇప్పటి వరకూ ఎన్ని రాజకీయ పార్టీలు మారారో బహుశా వాళ్లకే గుర్తుండదేమో.

సీన్ రివర్స్.. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

టైటిల్ చూడగానే.. ఇదేంటి సీన్ అంతా రివర్స్‌గా ఉందని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.

పేకాట ఆడితే ఉరిశిక్ష వేసేస్తారా..? : కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ కీలక మంత్రి కొడాలి నాని అనుచరులు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈబీ దాడులు నిర్వహించి భారీగా వాహనాలు, నగదు సీజ్ చేసిన విషయం విదితమే.

మ‌రో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు మెగా అవ‌కాశం

మెగాస్టార్ చిరంజీవి రెండు బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. బిగ్‌బాస్ సీజ‌న్ 3, సీజ‌న్ 4 కంటెస్టెంట్స్‌ను పోల్చి చూస్తే..

టాలీవుడ్‌పై అన‌సూయ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌... !

టాలీవుడ్ బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్ ఇమేజ్‌తో అద‌ర‌గొడుతున్న అతి కొద్ది మందిలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఉండ‌నే ఉంటుంది.