close
Choose your channels

అఖిల్‌తో కైరా...

Tuesday, March 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అఖిల్‌తో కైరా...

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చారు కానీ.. మంచి స‌క్సెస్ కోసం వెయిట్ చేయాల్సి వ‌స్తుంది. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర విజ‌యాల‌ను సాధించ‌లేదు.

దీంతో ఇప్పుడు అఖిల్ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం అఖిల్ స‌ర‌స‌న కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

భ‌ర‌త్ అనే నేను సినిమాతో టాలీవుడ్ రంగ ప్ర‌వేశం చేసిన బాలీవుడ్ బ్యూటీ కైరా.. తదుప‌రి రాంచ‌ర‌ణ్‌తో విన‌య‌విధేయ రామ‌లో న‌టించింది. ఇలా ఫ్యామిలీ హీరోల స‌ర‌స‌నే న‌టించిన కైరా అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ జ‌త‌గా కూడా న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.