క‌రోనాను లెక్క చేయ‌ని కిచ్చా సుదీప్

  • IndiaGlitz, [Friday,July 17 2020]

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచం స్త‌బ్దుగా మారింది. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ దారుణంగా దెబ్బతింది. సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ప్ర‌జ‌లు చాలా బ‌య‌ట‌కు రావ‌డానికి బ‌య‌ట‌ప‌డ్డారు. దేశ‌మంత‌టా లాక్‌డౌన్ కొన‌సాగింది. రీసెంట్‌గానే లాక్‌డౌన్‌ను స‌డ‌లిస్తున్నారు. ఈ స‌డ‌లింపుల స‌మ‌యంలోనే ప్ర‌భుత్వాలు సినిమా రంగంలోని వారికి కొన్ని విధి విధానాలను ఏర్పాటు చేసి షూటింగ్స్ చేసుకోమ‌ని అనుమ‌తులు ఇచ్చింది. అనుమ‌తులు అయితే వ‌చ్చాయి. కానీ షూటింగ్స్ చేసుకోవ‌డానికి సార్ట్స్ బ‌య‌ప‌డుతున్నారు. ఎక్క‌డా క‌రోనా ఎఫెక్ట్ అవుతుందేమోన‌ని వెన‌క‌డుగు వేస్తున్నారు.

ఇలాంటి త‌రుణంలో క‌న్న‌డ స్టార్ సుదీప్ మాత్రం క‌రోనా భ‌యాన్ని ప‌క్క‌న పెట్టి ముందుకు వ‌చ్చారు. ఈయ‌న తాజా చిత్రం ఫాంట‌మ్ చిత్రీక‌ర‌ణ‌ను హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభించారు. ఆ ఫొటోల‌ను కూడా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు సుదీప్‌. తెలుగు హీరోలే ఇక్క‌డ షూటింగ్స్ చేయ‌డానికి భ‌య‌ప‌డుతుంటే.. క‌న్న‌డ స్టార్ సుదీప్ ఇక్క‌డ షూటింగ్ చేయ‌డం చూస్తుంటే అత‌ని ధైర్యానికి అబ్బో అనాల్సిందే. మ‌రి సుదీప్ ధైర్యం ఎంత వ‌ర‌కు ముందుకు సాగుతుందో చూడాలి.

More News

మీడియా ముందుకు కేసీఆర్!.. వరాలుండేనా?

ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా వైరస్ తెలంగాణను తాకిన తొలి నాళ్లలో ఆయన నాలుగు రోజులకొకసారి

బాల‌కృష్ణ‌పై వ‌ర్మ సినిమా?

బాల‌కృష్ణ‌పై రామ్‌గోపాల్ వ‌ర్మకు చెప్ప‌రాని కోపం అయితే ఉంది. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌ర‌సం లేదు.

ర‌జినీ పొలిటిక‌ల్ అనౌన్స్‌మెంట్ అప్పుడేనా?

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమాల నుండి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

ఓటీటీలో త‌మ‌న్నా, కాజ‌ల్ సినిమా!!

2014లో హిందీలో వచ్చిన ‘క్వీన్’ సినిమా నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లోనూ రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఐదేళ్ల త‌ర్వాత అదే డైరెక్ట‌ర్‌తో సందీప్‌....

ప్ర‌స్థానం సినిమాతో న‌టుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సందీప్ కిష‌న్ అటు త‌మిళం, ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు సందీప్‌.