మెగాస్టార్ ని అనుకరించిన ఈ బుడతడు ఎవరో తెలుసా..

  • IndiaGlitz, [Tuesday,July 12 2016]

మెగాస్టార్ చిరంజీవి స్టిల్ చూసారు క‌దా....ఈ స్టైల్ ఏ సినిమాలో గుర్తుంది క‌దా...ఎస్..గ్యాంగ్ లీడ‌ర్. ఈ చిత్రంలో చిరంజీవి చెప్పిన ...చెయ్యి చూసావా ఎంత ర‌ఫ్ గా ఉందో...ర‌ఫ్ ఆడించేగ‌ల‌ను అనే డైలాగ్ ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ డైలాగ్ తో పాటు చొక్కా కాల‌ర్ ని స్టిల్ లో చూపించిన‌ట్టు పైకి ఎత్తే ఫోజు ప్రేక్ష‌కాభిమానుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంది.
అయితే...గ్యాంగ్ లీడ‌ర్ ను ఈ బుడ‌త‌డు అనుక‌రించాడు. ఇంత‌కీ ఈ బుడ‌త‌డు ఎవ‌ర‌నుకుంటున్నారా..? మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్. చిన్న‌ప్పుడే వ‌రుణ్ తేజ్ పెద‌నాన్న చిరంజీవిని అనుక‌రించాడు. ఈ విష‌యాన్ని వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...గ్యాంగ్ లీడ‌ర్ ను అనుక‌రించే ప్ర‌య‌త్నం చేసాను అంటూ ఈ స్టిల్ పోస్ట్ చేసాడు. ఇటీవ‌ల చిరంజీవి 150వ చిత్రం ఫ‌స్ట్ డే షూటింగ్ కి కూడా వ‌రుణ్ తేజ్ వెళ్లి చిరంజీవిని క‌లిసారు. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు పెద‌నాన్న చిరంజీవి అంటే వ‌రుణ్ తేజ్ కి ఎంత ఇష్ట‌మో..!

More News

రామ్ చ‌ర‌ణ్ ద‌త్త పుత్రుడు ఇత‌డే

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌నలు పెళ్లి చేసుకుని నాలుగేళ్లు అవుతుంది. చ‌ర‌ణ్ - ఉపాస‌న ఇద్ద‌రూ త‌మ కెరీర్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌నో మ‌రే కార‌ణం వ‌ల‌నో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దంప‌తులు శుభ‌వార్త చెప్ప‌లేదు.

క‌బాలి ప్ర‌మోష‌న్స్ కి ర‌జ‌నీ రాలేడా..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం క‌బాలి. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని రంజిత్ తెర‌కెక్కించారు. క‌లై ఫులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.

ఓం నమో వెంకటేశాయ లేటెస్ట్ అప్ డేట్..

నవరస సమ్రాట్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ.

ఇంట్ర‌స్టింగ్ గా ఉన్న ఫిల్మ్ ఛాంబ‌ర్లో రిజిష్ట‌రైన న్యూటైటిల్స్..

ఫిల్మ్ ఛాంబ‌ర్లో రిజిష్ట‌రైన న్యూటైటిల్స్ ఇంట్ర‌స్టింగ్ గా ఉండి ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి. ఇంత‌కీ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిష్ట‌ర్ చేసిన న్యూ టైటిల్స్ ఏమిటంటే...డైరెక్ట‌ర్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది.

మ‌ళ్లీ తండ్రి కాబోతున్న అల్లు అర్జున్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంప‌తుల‌కు 2014 ఏప్రిల్ 4న అయాన్ జ‌న్మించారు. ఇప్పుడు మ‌ళ్లీ బ‌న్ని తండ్రి కాబోతున్నాడా అంటే అవును అనే అంటున్నారు.